Free Thali Rs 90000 : థాలీ ఫ్రీ.. ఆర్డర్ చేశాక రూ.90,000 కట్ Pasha 2 years ago Free Thali Rs 90000 ఫ్రీ అని చెబితే.. ఎవరైనా ఎగబడతారు!! కానీ అలాంటి టైం లో ఎగబడొద్దు.. అత్యాశకు తావు ఇవ్వొద్దు.. ఆలోచనకు పదును పెట్టాలి.. ఫ్రీ గా ఎందుకు ఇస్తున్నారో ఆలోచించాలి. ఇలా చేయక.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ రూ. 90,000 (Free Thali Rs 90000) సైబర్ నేరగాడికి సమర్పించుకుంది. ఢిల్లీలోని ఒక బ్యాంక్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ళ సవితా శర్మకు .. ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ వచ్చింది. యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని.. దాని ద్వారా సింగిల్ థాలీ భోజనాన్ని ఆర్డర్ చేస్తే, మరో థాలీ ఫ్రీగా లభిస్తుంది అనేది ఆ మెసేజ్ సారాంశం. ఇది నిజమే అని నమ్మిన సవితా శర్మ.. ఆ లింక్ ను క్లిక్ చేసి ఫేక్ ఫుడ్ డెలివరీ యాప్‌ను ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంది. ఆ వెంటనే యాప్ నిర్వాహకులు కాల్ చేసి వెల్కమ్ చెప్పారు. యాప్ ను యాక్సెస్ చేసేందుకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు. సవితా శర్మ అవన్నీ యాప్ లోకి ఎంటర్ చేశాక.. జరగరానిది జరిగింది. ఆమె ఫోన్‌పై ఆమెకు కంట్రోల్ లేకుండా పోయింది. అది హ్యాక్ అయింది. Also read : YouTube: యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే డబ్బులు.. వెలుగులోకి కొత్త తరహా సైబర్ మోసం డబ్బులు ఇలా తస్కరించారు.. ఆ యాప్ నిర్వాహకులు .. సవితా శర్మబ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్లి.. యూపీఐ ఐడీలలోకి వెళ్లి డబ్బును కాజేశారు. మొదట రూ. 40,000.. రెండోసారి రూ.50,000 డ్రా అయ్యాయి.ఈ ట్రాన్సక్షన్స్ ను కూడా సైబర్ నేరగాళ్లు కొన్ని సెకన్లలోనే కంప్లీట్ చేశారు. తొలుత సవితా శర్మ క్రెడిట్ కార్డ్ నుంచి Paytm ఖాతాకు.. దాని నుంచి తమ ఖాతాలోకి సైబర్ మోసగాళ్లు డబ్బును వేసుకున్నారు. దీంతో తాను మోసపోయానని(Free Thali Rs 90000) సవితా శర్మ గ్రహించింది. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.