Site icon HashtagU Telugu

Delhi Police : సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు !

Delhi Police summons CM Revanth Reddy

Delhi Police summons CM Revanth Reddy

Union Minister Amit Shah: కేంద్ర మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫెక్‌ వీడియోల కేసు(fake videos case)లో సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)కి ఢిల్లీ పోలీసులు(Delhi Police)సమన్లు (Summons)పంపారు. ఈ మేరకు మే 1 న విచారణకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను కూడా విచారణకు తీసుకురావాలని ఢిల్లీ పోలిసులు సమన్లలో పేర్కొన్నారు. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీ పార్టీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో రేవంత్‌కు పోలీసులు సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల అమిత్‌ షా  తెలంగాణ పర్యటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు.

Read Also: Asaduddin Owaisi : కండోమ్స్ ఎక్కువగా ఉపయోగించేది ముస్లింలే – ఓవైసీ

మరోవైపు అమిత్‌షా ప్రసంగాన్ని పలువురు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఫేక్‌ వీడియోపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం స్పందించింది. ఈ మేరకు నకిలీ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపింది.