Delhi Police: రామేశ్వరం కేఫ్‌ ఘటన.. దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్‌

    Delhi Police: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌(Rameshwaram Cafe)లో నిన్న (శుక్రవారం) బాంబ్‌ బ్లాస్ట్ (Bomb Blast) ఘ‌ట‌న చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. (Delhi Police On High Alert ) నగరంలో భద్రతను పెంచారు. బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌ సహా ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. […]

Published By: HashtagU Telugu Desk
Delhi On High Alert

Delhi On High Alert

 

 

Delhi Police: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌(Rameshwaram Cafe)లో నిన్న (శుక్రవారం) బాంబ్‌ బ్లాస్ట్ (Bomb Blast) ఘ‌ట‌న చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. (Delhi Police On High Alert ) నగరంలో భద్రతను పెంచారు. బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌ సహా ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

ముఖ్యంగా ఢిల్లీ మార్కెట్‌(Delhi Market)లో నిఘా పెంచాలని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మార్కెట్‌ అసోసియేషన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లను సంప్రదించాలని కోరారు. మరోవైపు మార్కెట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బాంబ్‌ డిస్పోజల్‌ స్వ్కాడ్‌లు, బాంబు డిటెక్షన్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

బెంగళూరులో బాంబు పేలుడుతో హైదరాబాద్‌ పోలీసులు సైతం అలర్ట్‌ అయ్యారు. బస్‌స్టాండ్‌లు, రైల్వే స్లేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుంచి వాహనాల తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. బాంబ్‌స్కాడ్‌, డాగ్‌ స్కాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్‌ రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe)లో శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.మధ్యాహ్నం 12.30 గంటలకు పేలుడు జరిగింది. ఎన్‌ఐఏ, బాంబ్‌ స్కాడ్‌, ఫోరెన్సిక్‌ నిపుణులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఐఈడీ పరికరాల్ని ఉపయోగించి పేలుడుకు పాల్పడినట్లు సమాచారం.

కేఫ్‌లోకి బ్యాగ్‌తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్యక్తికి (Bengaluru Blast Suspect) సీసీటీవీకి చిక్కాడు. పేలుడు జ‌ర‌గ‌డానికి ముందు ఆ అనుమానాస్పద వ్యక్తి కేఫ్‌లో బ్యాగ్ పెట్టి వెళ్లిన‌ట్లు గుర్తించారు. అనుమానితుడితో ఉన్న మ‌రో వ్యక్తిని పోలీసులు ప‌ట్టుకున్నారు. బెంగుళూరు పోలీసులు అత‌న్ని విచారిస్తున్నారు. ప్రధాన అనుమానితుడి ఫేస్ మాత్రం మాస్క్‌తో క‌ప్పి ఉన్నది. అత‌డు క్యాప్ ధ‌రించాడు. ప్లేట్‌లో ఇడ్లీ తీసుకెళ్తున్నట్లు కూడా కేఫ్‌లో ఉన్న కెమెరాల‌కు చిక్కాడత‌ను.

read also : Kendriya Vidyalaya : కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి అడ్మిషన్ ఇలా..

  Last Updated: 02 Mar 2024, 01:32 PM IST