Delhi Elections : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తున్న రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ సెటైర్ ట్వీట్ చేశారు. దీనికి 2024 లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను కేటీఆర్ జతచేశారు. దేశంలో మోడీకి అత్యంత నమ్మకమైన కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీనే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. మోడీని, బీజేపీని అడ్డుకోవడం రాహుల్ వల్ల కాదని తాను గతంలోనే చెప్పానంటూ కేటీఆర్ ఈ వీడియోను షేర్ చేశారు.
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
Well done 👏 https://t.co/79Xbdm7ktw
— KTR (@KTRBRS) February 8, 2025
ఇకపోతే..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి దిశగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ (BJP) అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ అత్యధికంగా 45 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 25 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది.
ఒకానొక సమయంలో లీడ్‌లోకి వచ్చిన కేజ్రీ ఆ తర్వాత కొద్దిసేపటికే వెనుకపడిపోయారు. కేజ్రీపై బీజేపీ అభ్యర్థ పర్వేశ్ సాహిస్ సింగ్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కేజ్రీపై పర్వేశ్ 1,170 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇక కల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆమె ఒక్కసారి కూడా లీడ్‌లోకి రాలేదు. ఇక్కడ ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి 3,231 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక షాకూర్‌బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ ఏకంగా 15 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. జంగ్‌పూరాలో మనీశ్ సిసోడియా 2,438 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూ ఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు.
Read Also: Delhi Election Results : ఫస్ట్ బోణి కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ