Site icon HashtagU Telugu

Atishi Marlena : ఢిల్లీ సీఎం కుర్చీ ఎప్పటికీ ఆయన కోసమే : అతిషీ మర్లెనా

Delhi CM chair is always for Kejriwal: Atishi Marlena

Delhi CM chair is always for Kejriwal: Atishi Marlena

Delhi CM Atishi : అతిషీ మర్లెనా ఈరోజు (సోమవారం) ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన ఓ కుర్చీని ఉంచడంతో పాటు తాను వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది.

Read Also: Devara : ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు పై శ్రేయస్ మీడియా క్లారిటీ

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అతిషీ మర్లెనా మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం కుర్చీ ఎప్పటికీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కోసమే ఉంటుందని తెలిపారు. రాముడు 14 ఏళ్లు వనవాసంలో ఉన్నప్పుడు భరతుడు రాజ్యం యొక్క బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి బాధ కలిగిందో ఈరోజు నాకు కూడా అంతే బాధగా ఉంది అని పేర్కొన్నారు. ఎంతో కఠిన సమయంలో ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు. 14 ఏళ్ల పాటు భరతుడు కుర్చీపై చెప్పులు పెట్టుకుని పాలన ఎలా చేశాడో.. నేను కూడా అదే విధంగా రాబోయే నాలుగు నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి ఆరు నెలలు జైలులో ఉంచిన.. ఢిల్లీ ప్రజలు ఆయన నిజాయితీపై నమ్మకం ఉంచారని వెల్లడించింది. ఢిల్లీ సీఎం పీఠం అరవింద్ కేజ్రీవాల్‌కే చెందుతుంది.. ప్రజలు మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని అతిషీ మర్లెనా వ్యాఖ్యనించింది.

కాగా, అతిషీ మర్లెనా ముఖ్యమంత్రి పదవిలో మరో 5 నెలలే ఉంటారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే, మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆమెకు పరిపాలన చేసేందుకు ఐదు నెలలే ఛాన్స్ ఉంది. ఇంత తక్కువ టైమ్‌లోనే ఆమె ముఖ్యమంత్రిగా తన మార్క్ చూపించాల్సి ఉండనుంది. అదే సమయంలో తన మంత్రిత్వ శాఖలనూ చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మళ్లీ ఆప్ ని అధికారంలోకి తేవాల్సిన బాధ్యత కూడా అతిషీ పైనే ఉంటుంది.

Read Also: Gandhi Hospital : బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..హరీష్ రావు ఆగ్రహం