Site icon HashtagU Telugu

Akkineni Nagarjuna : కొండా సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావా.. రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున

Nagarjuna

Nagarjuna

Defamation suit :  సినీ నటుడు అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు. రేపు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు తెలిపింది. రేపు కోర్టు‎కు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Read Also: Maldives : భారతీయ టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి

ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ.. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా.. హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

Read Also: T20 World Cup Semi-Final: టీమిండియా సెమీఫైన‌ల్‌కు అర్హ‌త సాధిస్తుందా..?

Exit mobile version