Site icon HashtagU Telugu

ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

Chat Gdp

Chat Gdp

ఓపెన్ AI చాట్‌ జీపీటీని ఎదుర్కొనేందుకు టెక్ దిగ్గజం గూగుల్ రెడీ అవుతోంది. మైక్రోసాఫ్ట్ యొక్క బింగ్‌ సెర్చ్ ఇంజిన్ తో ఓపెన్ AI చాట్‌ జీపీటీ కలిస్తే గూగుల్ పని అయిపోయినట్టే అనే వార్తలు వస్తున్నాయి. వీటి నేపథ్యంలో అలర్ట్ అయినగూగుల్ కు చెందిన AI ల్యాబ్ ‘డీప్‌మైండ్’ సరికొత్త ప్రోడక్ట్ ను తయారు చేసింది. ‘స్పారో’ పేరుతో AI చాట్‌బాట్ ను విడుదల చేసేందుకు గూగుల్ రెడీ అవుతోందని వార్తలు వస్తున్నాయి.

‘డీప్‌మైండ్’ స్టోరీ ఇది..

2010లో స్థాపించబడిన బ్రిటీష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ డీప్‌మైండ్‌ను 2014లో గూగుల్ కొనుగోలు చేసింది. ఈ ల్యాబ్ అనేక సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసింది. ఆల్ఫాఫోల్డ్ ప్రోటీన్ ఫోల్డింగ్‌ను అంచనా వేసే ఒక టెక్నాలజీని అది తయారు చేసింది. ఇది మాలిక్యులర్ బయాలజీ స్వరూపాన్ని మార్చేందుకు దోహదపడే ఒక సరికొత్త టెక్నిక్. డీప్‌మైండ్ సాంకేతికతను ఇప్పటికే క్రీడలు, పురావస్తు శాస్త్రంతో సహా వివిధ పరిశ్రమలలో  ప్ర‌యోగిస్తున్నారు.
. DeepMind ద్వారా AI చాట్‌బాట్ ల్యాబ్ అభివృద్ధి చేసిన Chinchilla language model పై ఆధారపడి ‘స్పారో’ పనిచేస్తుంది. ఇది ఇప్పటికే తక్కువ పక్షపాత యంత్ర అభ్యాస వ్యవస్థగా పరిగణించబడుతోంది.  ఇది సురక్షితమైన AI అసిస్టెంట్‌గా మారుతుందని గూగుల్ అంటోంది. ChatGPTలో లేని ఎన్నో ఫీచర్లను ‘స్పారో’లో యాడ్ చేసే పనిలో గూగుల్ నిమగ్నమైంది. అయితే ఎప్పుడు దీన్ని లాంచ్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.