Site icon HashtagU Telugu

Floods in Death Valley..!: ప్రపంచంలోనే వేడి ప్రదేశం.. అక్కడ వరదలు..!

Death Valley

Death Valley

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల భయంకరమైన ప్రదేశాలు ఉంటాయి. అవి ఎంత భయంకరంగా ఉంటాయి అంటే అటువంటి ప్రదేశాలలో మానవుడు కొన్ని గంటలు ఒక రోజు కూడా మనుగడను సాగించలేరు. ఇప్పుడు అలాంటి ప్రదేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..అమెరికాలోని కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ అనే ఒక ప్రదేశం ఉంది. అయితే ఇది పేరుకు తగ్గట్టే మృత్యు లోయ. మృత్యులోయ అని ఎందుకు అంటున్నావు అంటే ఇక్కడ అడుగుపెట్టిన వారెవరూ ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. కనీసం తాగడానికి నీరు కూడా దొరకదు. అలాగే కనుచూపు మీదనా ఎక్కడ కూడా నీడ ఇవ్వడానికి చెట్లు కూడా ఉండవు.

చుట్టూ ఎటు చూసినా కూడా కొండలు, గుట్టలు, పొదలు, ఇసుక నేలలతో కూడి ఓ ఎడారిలా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యేది కూడా ఇక్కడే. అయితే ఈ డెత్ వ్యాలీ అనే ప్రదేశంలో ఒక్క చినుకు పడినా కూడా అది గొప్ప విషయమే అని చెప్పవచ్చు. ఆ ప్రదేశంలో వరదలు వచ్చాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు వెయ్యిళ్లకు ఒకసారి మాత్రమే ఇలా వర్షం కురుస్తుంది అన్న రీతిలో వర్షపాతం నమోదు అయింది. దీనితో అక్కడ ఏకంగా వరదలు సంభవించాయి. కాగా, ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వం పర్యాటకులను అనుమతిస్తోంది.

 

ఆ విధంగా పర్యటనకు వచ్చిన 500 మందికి పైగా టూరిస్టులు, 500 మంది సిబ్బంది ఈ వరదల ధాటికి అక్కడే చిక్కుకుపోయారు. రెండు డజన్లు వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ఆరు గంటల నరకం అనంతరం వారందరూ సురక్షితంగా బయటపడగలిగారు. అయితే గత రెండు వారాల వ్యవధిలో ఇలాంటి కుండపోత వర్షం పడడం ఇది నాలుగో సారి.