Site icon HashtagU Telugu

Viral Video : అభిమాని బీర్ గ్యాస్ లో పడిన క్రికెట్ బాల్ వీడియో వైరల్..?

Lmznavwf

Lmznavwf

ప్రస్తుతం ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో టెస్ట్ లో భాగంగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ టెస్ట్ లో శతకం బాది మంచి జోరు మీద ఉన్న ఆల్ రౌండర్ డారిల్ మిషెల్ రెండో టెస్టులో తొలి రోజు ఆటలో తన జోరును ప్రదర్శించాడు. ఇకపోతే ఈ ఆట ముగిసే సమయానికి మిషెల్ 8 ఫోర్స్,2 స్పీకర్ లతో 81 పరుగులు తీసీ క్రిజులో ఉన్నాడు.

డారిల్ మిషెల్ రెండు సిక్స్ లు కొట్టగా అందులో ఒక సిక్స్ మాత్రం హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ బౌలర్ జాక్ లీచ్ బౌలింగ్ లో లాంగాన్ మీదుగా డారిల్ మిషెల్ కొత్తగా ఆ బంతి నేరుగా వెళ్లి స్టాండ్స్ లో పడింది.

 

అయితే మామూలుగా పడ్డట్లు స్టాండ్స్ పడితే పర్లేదు కానీ, ఊహించని విధంగా అదేదో మ్యాజిక్ అన్నట్టుగా ఒక క్రికెట్ అభిమాని బీరు గ్లాసులో వెళ్లి పడింది ఆ బంతి. ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంతి పడిన మొదటిదానికి గ్లాస్ ముక్కలయ్యింది.