Falling From 68th Floor : అతడు బల్లిలా పెద్ద పెద్ద భవనాలపైకి అవలీలగా పాకుతాడు..
ఆయన సాహసోపేత విన్యాసాలు చూస్తుంటే మనకే గుండె ఆగిపోయినంత పనవుతుంది..
వయసు 30 ఏళ్లే అయినా.. ఇప్పటిదాకా ఎన్నో బిల్డింగ్ లు ఈజీగా ఎక్కేసి అందరితో “డేర్ డెవిల్” అనిపించుకున్నాడు..
ఫ్రాన్స్ కు చెందిన 30 ఏళ్ల సాహస క్లయింబర్ రెమి లూసిడి (Remi Lucidi) సాహస విన్యాసం చేస్తూనే దుర్మరణం పాలయ్యాడు.
హాంకాంగ్ లో ఉన్న ట్రెగుంటర్ టవర్ (Tregunter Towers) కాంప్లెక్స్‌పైకి ఎక్కుతుండగా.. 68వ అంతస్తు నుంచి కింద పడిపోయి రెమి లూసిడి ప్రాణాలు కోల్పోయాడు.
721 అడుగుల ఎత్తు నుంచి పడటంతో అక్కడిక్కక్కడే చనిపోయాడు.
Also read : Weekly Horoscope : ఓ రాశి వాళ్లకు ఆర్థిక నష్టాలు.. మరో రాశి వాళ్లకు ఉద్యోగ కష్టాలు
రెమి లూసిడిని సోషల్ మీడియాలో అందరూ ‘రెమి ఎనిగ్మా’ అని పిలుస్తారు. అతడు గత గురువారం రాత్రి 7:30 గంటలకు ట్రెగుంటర్ టవర్ లోకి వచ్చాడు. 40వ అంతస్తులో ఉన్న తన ఫ్రెండ్ ను కలవడానికి వెళ్తున్నానని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. అయితే రెమి లూసిడి ట్రెగుంటర్ టవర్ 68వ అంతస్తు నుంచి పడిపోతున్న క్రమంలో.. పెంట్ హౌస్ కిటికీ తలుపులను పట్టుకొనే ప్రయత్నం చేశాడని ఒక ఇంటి పనిమనిషి చెప్పింది. ఒకవేళ ఆ కిటికీ తలుపులు, చేతులకు చిక్కి ఉంటే.. కచ్చితంగా రెమి లూసిడి ప్రాణాలను కాపాడుకొని ఉండేవాడని అంటున్నారు. బిల్డింగ్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో… లూసిడి 49వ అంతస్తులో ఉన్న ఎలివేటర్ నుంచి బయటకు వచ్చి 68వ అంతస్తు వైపునకు వెళ్లే మెట్లను ఎక్కుతున్న దృశ్యాలు(Falling From 68th Floor) ఉన్నాయి. 6 రోజుల క్రితం లూసిడి హాంకాంగ్ స్కైలైన్ యొక్క చివరి ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. రెమి లూసిడి మరణంపై ఇన్ స్టాగ్రామ్ వేదికగా నెటిజన్స్ విచారం వ్యక్తం చేశారు.
Also read : WI vs IND 2nd ODI: వాటర్ బాయ్‌గా కింగ్ కింగ్