Site icon HashtagU Telugu

Bhatti : ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం: డిప్యూటీ సీఎం

Damage to the industrial sector due to the propaganda of the opposition: Deputy CM

Damage to the industrial sector due to the propaganda of the opposition: Deputy CM

Bhatti Vikramarka: హైదరాబాద్​లోని బషీర్​బాగ్​లో ఉన్న సురవరం ప్రతాప్​రెడ్డి ఆడిటోరియంలో జరిగిన మీట్​ ది ప్రెస్​లో డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ..ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగాని(industrial sector)కి నష్టం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్(Congress) వస్తే పరిపాలన చేయలేదని అనేక మంది విమర్శించారన్నారు. తాము వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ధనిక రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వచ్చాయని చాలామంది ప్రశ్నిస్తున్నారని తెలిపారు. సాగునీరు, విద్యుత్‌పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందన్నారు. ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం కూడా మంచిది కాదన్నారు. ప్రజలకు వాస్తవాలను చెప్పేందుకు తాను మీడియాకు ముందుకు వచ్చా అన్నారు.

Read Also: Ex MP Ravindra Naik : కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

రైతు బంధు ఇవ్వలేదని బీఆర్​ఎస్​ నేతలు ప్రచారం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు ఉంచామని ప్రచారం చేస్తున్నారన్నారు. తాము ప్రమాణస్వీకారం చేసిన రోజు ఖజానాలో ఉన్నది మైనస్​ రూ.3960 కోట్లు అని స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలు, ఉచిత బస్సు ప్రయాణాలకు నిధులు సమకూర్చాలని ఈ సందర్భంగా వివరించారు. గృహలక్ష్మి కింద ఆర్టీసీకి ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీకి ఇప్పటివరకు రూ.1,120 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.