Cyclone Mocha : 6 మంది మృతి..700 మందికి గాయాలు

బంగ్లాదేశ్, మయన్మార్ లోని అనేక ప్రాంతాలను మోచా సైక్లోన్ (Cyclone Mocha) అతలాకుతలం చేసింది. మయన్మార్ ఓడరేవు నగరం సిట్వే వరదల్లో మునిగిపోయింది. గంటకు 130 మైళ్ల వేగంతో వీచిన ఈదురు గాలులు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి.

  • Written By:
  • Updated On - May 15, 2023 / 12:32 PM IST

బంగ్లాదేశ్, మయన్మార్ లోని అనేక ప్రాంతాలను మోచా సైక్లోన్ (Cyclone Mocha) అతలాకుతలం చేసింది. మయన్మార్ ఓడరేవు నగరం సిట్వే వరదల్లో మునిగిపోయింది. గంటకు 130 మైళ్ల వేగంతో వీచిన ఈదురు గాలులు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. యాంగూన్ లో చాలా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భవనాలపై నుంచి హోర్డింగ్ లు ఎగిరిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చెట్లు కూలి, కొండ చరియలు విరిగి పడి, భవనాలు కూలిన ఘటనల్లో మొత్తం ఆరుగురు మృతిచెందగా, 700 మందికి గాయాలయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన వేలాది మందిని మయన్మార్ లోని మఠాలు, పగోడాలు, పాఠశాలలకు తరలించారు. అయితే ఈ సైక్లోన్ (Cyclone Mocha) మయన్మార్ లోని రఖైన్ రీజియన్ ను తాకిన తరువాత బలహీనపడింది.

also read : Earthquake: మయన్మార్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2గా నమోదు

300,000 మంది రోహింగ్యా శరణార్థులను..

మయన్మార్ లోని వాయవ్య రాష్ట్రమైన చిన్, సెంట్రల్ రీజియన్లను మోచా సైక్లోన్ సోమవారం తాకే అవకాశం ఉంది. కాక్స్ బజార్ లోని సుమారు 300,000 మందిని రోహింగ్యా శరణార్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈనేపథ్యంలో పశ్చిమ బెంగాల్ కు అలర్ట్ ప్రకటించామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వివిధ తీర ప్రాంతాల్లో మోహరించామని తెలిపారు. పశ్చిమబెంగాల్ లోని సీ రిసార్ట్ పట్టణాలపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ సిబ్బంది నిఘా ఉంచి బీచ్ కు వెళ్లకుండా పర్యాటకులను అడ్డుకుంటున్నారు. పుర్బా మేదినీపూర్ జిల్లాలోని దిఘా, మందర్మణి, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని బఖాలీ, సుందర్బన్స్ తీర ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ దళ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో రెండు జిల్లాల్లోని తీరప్రాంత వాసులను ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేశారు.