Site icon HashtagU Telugu

Cybercrime: సైబర్ మోసగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి..రూ. 3.5 కోట్లు

Cyber Crime

Cyber Crime

Cybercrime: టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఆసాంతం ఆన్లైన్ కావడంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి 3 కోట్లు నష్టపోయాడు. బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి నుంచి రూ. 3.5 కోట్లను నేరగాళ్లు స్వాహా చేసినట్లు పోలీసులు తెలిపారు.

బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ట్రాయ్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారు. ముంబై పోలీస్ స్టేషన్‌లో మీపై క్రిమినల్ కేసు మరియు మనీలాండరింగ్ కేసు నమోదు చేయబడింది. విచారణ కోసం ముంబైకి రావాల్సి ఉంటుంది అని సైబర్ మోసగాళ్లు సదరు వ్యక్తికి నమ్మబలికారు. ఆ తర్వాత మరో నంబర్ నుంచి వీడియో కాల్ చేశారు. లిఫ్ట్‌ వచ్చిన వెంటనే ఖాకీ దుస్తులు, నకిలీ ఐడీ కార్డులు, ఫిర్యాదు కాపీని చూపించి ఆ వ్యక్తిని బెదిరించారు. దీంతో భయపడిన వ్యక్తి అరెస్టు చేయకుండా ఉండేందుకు తమ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు చెప్పిన విధంగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు. కేవలం 48 గంటల్లో వారు చెప్పిన ఖాతాలన్నింటికీ రూ.3.7 కోట్లు బదిలీ చేశాడు. తిరిగి కాల్ చేయగా నేరగాళ్లు కాల్ ఎత్తలేదు. మోసపోయానని గ్రహించిన వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. అయితే ఇందులో రూ.3కోట్లకు పైగా నగదు ఉండడంతో పోలీసులు కేసును సీఐడీకి అప్పగించారు.

Also Read: Dwakra Drones: మహిళలకు డ్వాక్రా డ్రోన్లు…కేంద్రం కీలక నిర్ణయం