Class Room : క్లాస్ రూమ్‌లో అబ్బాయిల‌కు, అమ్మాయిల‌కు మ‌ధ్య‌లో తెర‌..!

కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో క్లాస్ రూంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య తెర ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయింది.

  • Written By:
  • Updated On - July 9, 2022 / 12:02 PM IST

కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో క్లాస్ రూంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య తెర ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయింది. త్రిసూర్ లోని ఆ వైద్య కళాశాలలో ఇస్లామిక్ దృష్టికోణంలో ఎల్జీబీటీక్యూఏఈ వర్గం (గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్) అనే అంశంపై తరగతులు నిర్వహించారు. ముజాహిద్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అనే ఇస్లామిక్ సంస్థ ఈ క్లాసులు ఏర్పాటు చేసింది.

ఎల్జీబీటీక్యూఐఏ బిహైండ్ రెయిన్ బో ఫ్లాగ్స్… అండర్ స్టాండింగ్ ఎల్జీబీటీక్యూఐఏ ఫ్రం యాన్ ఇస్లామిక్ పర్ స్పెక్టివ్ పేరిట జరిపిన ఈ క్లాసుల్లో… అమ్మాయిలు ఓవైపు, అబ్బాయిలు ఓ వైపు కూర్చోగా, మధ్యలో ఓ కర్టెన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను సదరు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కు చెందిన సభ్యుడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయంపై విద్యార్థి సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), వామపక్ష విద్యార్థి విభాగం ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. విద్యార్థుల మధ్య తెర ఎందుకని ఏ ఒక్కరూ ప్రశ్నించకపోవడం దారుణమని కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, విమర్శలు వస్తున్నప్పటికీ ముజాహిద్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంస్థ తమ చర్యను సమర్థించుకుంటోంది. తాము చేసిన దాంట్లో తప్పేమీ లేదని వాదిస్తోంది.