Crypto: 100 డాలర్లు అడిగితే కోటి ఇచ్చారు.. కానీ అలా ఇచ్చినట్టే ఇచ్చి చివరికి షాక్?

సాధారణంగా మనం కొన్నిసార్లు చేసే పనులలో మనకు తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 10:40 AM IST

సాధారణంగా మనం కొన్నిసార్లు చేసే పనులలో మనకు తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే డబ్బు ట్రాన్స్ఫర్ చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని డబ్బు ఇతరులకు పంపించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి పొరపాట్లు కారణంగా ఓ మహిళ ఖాతాలో మిలియన్ డాలర్లు జమ అయిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సింగపూర్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్  క్రిప్టో డాట్‌కామ్‌ పొరపాటున దేవమనోగారి మణివేల్ ఖాతాకు 100 డాలర్లు రిఫండ్ చేయాల్సింది పోయి ఏకంగా 10.5 మిలియన్ డాలర్లు సెండ్ చేసింది. ఈ విధంగా ఆ మహిళ ఖాతాలో ఏకంగా అంత పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడంతో కొంత డబ్బును తన కూతురికి ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా మరి కొంత డబ్బుతో మెల్బోర్న్‌లో 1.35 మిలియన్ల ఖరీదైన భవనం కొనుగోలు చేసి దానిని తన సోదరి పేరు పై మార్చారు.

అయితే ఈ తప్పును చాలా ఆలస్యంగా గుర్తించిన క్రిప్టో డాట్‌కామ్‌ వారి డబ్బులను వారికి వెనక్కి ఇవ్వాలి అంటూ ఏకంగా కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం దేవమనోగారి మణివేల్, ఆమె సోదరి నుంచి క్రిప్టో డాట్‌కామ్‌ కి రావాల్సిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు షాక్ ఇచ్చింది. దేవమనోగారి మణివేల్ తప్పించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నిజం బయటపడటంతో కోర్టు నుంచి వారికి ఊహించని తీర్పు రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.