Site icon HashtagU Telugu

Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

Cocodile Attack

Cocodile Attack

రాజస్థాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిపై మొసలి దాడిచేసింది. ఆ వ్యక్తిని లాక్కెళ్లింది. సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మొసలి లాక్కెళ్లిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఖటోలి పట్టణంలోని పార్తి నదిలో బిల్లూ అనే 38 ఏళ్ల వ్యక్తి స్నానానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న మొసలి ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడింది. నోట కరుచుకుని నదిలోకి లాకెళ్లింది.

నదిలో స్నానం చేస్తున్న మిగతావాళ్లు ఒడ్డుకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. NDRFసిబ్బందితో కలిసి బిల్లూ కోసం గాలించారు. నదిలో మొసళ్లు ఉండటంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ గాలింపు చేపట్టారు. అయితే అతని ఆచుకీ ఇంకా లభ్యం కాలేదు.