Site icon HashtagU Telugu

Hardik Pandya: తన అత్తగారిని మొదటిసారి కలుసుకున్న ఫన్నీ వీడియోను షేర్ చేసిన హార్దిక్ పాండ్యా..!!

Hardik Pandya

Hardik Pandya

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తొలిసారిగా తన అత్తగారిని కలిశాడు. దీనికి సంబంధించిన వీడియోను హార్దిక్ పాండ్యా ట్వీట్టర్ లో పోస్టు చేశారు. హార్దిక్ పాండ్యా 2020లో నటాషా స్టాంకోవిచ్ తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020 జులైలో నటాషా, హార్దిక్ లకు కొడుకు జన్మించాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత సెర్బియాలో ఉంటున్న నటాషా కుటుంబాన్ని మొదటిసారిగా కలుసుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఆ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేశాడు. హార్దిక్ పాండ్యాను చూసిన తన అత్తగారూ సంతోషంగా తనను హత్తుకుంటుంది. మొదటిసారిగా నటాషా కుటుంబాన్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్ అత్తగారు రద్మిలా స్టాంకోవిక్ మాట్లాడుతూ…హార్దిక్ కచ్చితంగా మా దగ్గరకు వస్తాడని తెలుసు. అతను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Exit mobile version