Cowin Data Leak : అంగట్లో కరోనా వ్యాక్సిన్ లబ్ధిదారుల సమాచారం.. టెలిగ్రామ్ బాట్ తో లీక్

Cowin Data Leak : మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా ? మీరే కాదు..  మీలా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం లీక్ అయింది.. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడే కొవిన్ ప్లాట్ ఫామ్ లో నమోదు చేసేందుకు ప్రజలు ఇచ్చిన డీటెయిల్స్ బజారున పడ్డాయి..

  • Written By:
  • Updated On - June 12, 2023 / 01:47 PM IST

Cowin Data Leak : మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా ? 

మీరే కాదు..  మీలా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం లీక్ అయింది.. 

వ్యాక్సిన్ తీసుకునేటప్పుడే కొవిన్ ప్లాట్ ఫామ్ లో నమోదు చేసేందుకు ప్రజలు ఇచ్చిన డీటెయిల్స్ బజారున పడ్డాయి..

ఒక టెలిగ్రామ్‌ బాట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ లీకేజీ జరిగింది..   

వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఇచ్చిన ఫోన్ నంబర్ ను ఆ టెలిగ్రామ్‌ బాట్ లో ఎంటర్ చేయగానే సమస్త సమాచారం వస్తోంది. 

పేరు, ఇంటి అడ్రస్,  పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పాన్ కార్డు నంబర్, ఓటర్ ఐడీ నంబర్,  పాస్ పోర్ట్ నంబర్, వ్యాక్సిన్ కేంద్రం వివరాలన్నీ వచ్చేస్తున్నాయి..  

ఈమేరకు జాతీయ మీడియా సంస్థలు సంచలన కథనాలు ప్రచురించాయి.. 

దీనిపై తొలి న్యూస్ రిపోర్ట్ ను the fourth అనే మలయాళం న్యూస్ పోర్టల్ పబ్లిష్ చేసింది. 

కరోనా వ్యాక్సిన్లను తీసుకోవడానికి CoWIN పోర్టల్‌లో ప్రజలు నమోదు చేసిన వ్యక్తిగత వివరాలను ఒక టెలిగ్రామ్ బాట్ లీక్ (Cowin Data Leak) చేసింది. ఆ బాట్ లో ఫోన్ నంబర్‌ ను కానీ.. ఆధార్ నంబర్‌ను కానీ ఎంటర్ చేయగానే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలన్నీ వచ్చేస్తున్నాయి. చాలా కుటుంబాలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఒకే ఫోన్ నంబర్ ఇచ్చాయి. అలాంటి వాళ్ళ ఒక నంబర్ ను ఈ బాట్ లో ఎంటర్ చేయగానే.. మొత్తం ఫ్యామిలీలో అందరి ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే అవుతోంది. వాస్తవానికి CoWIN పోర్టల్ లోకి వ్యక్తులు లాగిన్ కావాలంటే రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ కు వచ్చిన OTP నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ వివాదాస్పద టెలిగ్రామ్ బాట్ లో OTP నంబర్ అక్కర లేకుండానే ఈ వివరాలన్నీ వస్తున్నాయి.

కొవిన్ పోర్టల్ నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, జర్నలిస్టుల డేటా కూడా లీక్ అయింది. కొవిన్ పోర్టల్ నుంచి లీకైన తన వ్యక్తిగత వివరాల స్క్రీన్‌ షాట్లను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే టెలిగ్రామ్‌ ఛానల్ లో పోస్ట్ చేశారు. డెరెక్ ఓబ్రెయిన్, పి.చిదంబరం, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ వంటి రాజకీయ నాయకులు.. రాజ్‌దీప్ సర్దేశాయ్, బర్ఖా దత్ వంటి జర్నలిస్టుల డేటా కూడా లీక్ అయిందని ఆయన చెప్పారు. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కూడా సాకేత్ గోఖలే షేర్ చేశారు. లీక్ బాధితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా ఉన్నారని మలయాళ మనోరమ దినపత్రిక తెలిపింది. ఆయన ఫోన్ నంబర్‌ను టెలిగ్రామ్ బాట్ లోకి ఎంటర్ చేయగానే.. రాజేష్ భూషణ్ ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ వచ్చాయని పేర్కొంది.