Site icon HashtagU Telugu

Viral Video : చెన్నై వీధుల్లో బాలిక ఫై ఆవు దాడి..చూస్తే హృదయం తరుక్కుపోతోంది

Cow attacks Chennai girl

Cow attacks Chennai girl

ఇటీవల కాలంలో మనుషులపై పెద్ద ఎత్తున పశువులు దాడి (Cow attacks) చేస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే పగ పడుతున్నాయి కూడా. ఈ పశువుల దాడికి భయపడి చాల మంది రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు. తాజాగా చెన్నై వీధుల్లో ఓ స్కూల్ విద్యార్థిని ఫై ఓ ఆవు చేసిన దాడి చూస్తే హృదయం తరుక్కుపోతోంది. వామ్మో ఇలాంటి ఆవులు కూడా ఉంటాయా..అని అనుకోకుండా ఉండలేరు. అంతలా ఆ ఆవు విరుచుకుపడింది. కొమ్ములతో పైకి లేపి విసిరికొట్టింది.. కాళ్లతో తొక్కుతూ బీభత్సం సృష్టించింది. బాలికను రక్షించేందుకు ప్రయత్నించిన పెద్దవారిపైనా దాడికి ప్రయత్నించింది. సిటీలోని ఎంఎండీఏ కాలనీలో జరిగిన ఈ దారుణంలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

చెన్నైలోని (Chennai ) ఎంఎండీఏ కాలనీలో (MMDA colony) తల్లితో కలిసి ఆయేషా అనే చిన్నారి స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ ఇద్దరి కంటే ముందు రెండు ఆవులు వెళ్తున్నాయి. ఏమైందో తెలియదు.. సడెన్ గా అందులో ఓ ఆవు వెనక్కి తిరిగి ఆ చిన్నారిపై దాడి చేసింది. అది కూడా మామూలు దాడి కాదు. ఏదో ఆ పాపపై పగబట్టినట్టుగా దాడి చేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని కొమ్ములతో పైకి లేపి విసిరికొట్టింది.. కాళ్లతో తొక్కుతూ బీభత్సం సృష్టించింది. ఆ తల్లి ఒంటరిగా నిస్సహాయురాలై చూస్తుండిపోయింది. అక్కడున్న స్థానికులు రాళ్లతో ఆవుల్ని విదిలించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మద్యలో ఓ వ్యక్తి ఆ చిన్నారిని కాళ్లతో ఇవతలకు లాగినా..మళ్లీ వచ్చి దాడి చేసింది. పాపం ఆ చిన్నారి పగబట్టినట్టుగా జరిపిన ఆవు దాడిలో తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా నలిగిపోయింది. ఇంకాస్సేపు ఈ దాడి జరిగుంటే ఆ చిన్నారి ప్రాణాలు కూడా పోయేవి. ఇంతలో ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో అప్పటికి గానీ ఆవు పారిపోలేదు. దీనికి సంబదించిన (Incident ) వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : Gold Man Visits : తిరుమలలో ప్రత్యేక్షమైన గోల్డ్ మాన్..చూసేందుకు పోటీపడ్డ భక్తులు