Site icon HashtagU Telugu

Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

cart-puller

cart-puller

“ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. నడవరా ముందుగా.. అటో, ఇటో, ఎటో వైపు!!” అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినీ గీతంలో చక్కగా చెప్పారు. ఆయన చెప్పినట్టే.. కొందరు దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇతరులకు చేతనైనంత సాయం చేస్తున్నారు. ఈ కోవలోకే వస్తాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్. కాళ్లకు చెప్పులు లేకుండా .. మిట్ట మధ్యాహ్నం.. నడి రోడ్డుపై నుంచి వెళ్తున్న రిక్షావాలాకు ఆయన చెప్పులు కొనిచ్చారు. ఆ సాయానికి ఎంతో ఆనందపడిన రిక్షావాలా .. రెండు చేతులు జోడించి పోలీస్ కానిస్టేబుల్ కు కృతజ్ఞతలు తెలిపారు.

దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. శివాంగ్ శేఖర్ గోస్వామి అనే ఉత్తరప్రదేశ్ పోలీసు
జూలై 1న వీడియోను పోస్ట్ చేయగా..ఇప్పటికే 2.30 లక్షల వ్యూస్ వచ్చాయి. పోలీసు కానిస్టేబుల్ అంటే ప్రజా రక్షణకే పరిమితం కాకుండా.. ప్రజా సేవకులుగానూ మారుతున్నారు అనేందుకు ఇదొక నిదర్శనం. రిక్షావాలా కు కానిస్టేబుల్ చేసిన సాయంపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపదలో ఉన్నవారికి.. అవసరం ఉన్నవారికి సాయం చేయడానికి మించిన డ్యూటీ మరొకటి ఉండదని ఇంకొందరు కామెంట్ చేశారు.

Exit mobile version