Site icon HashtagU Telugu

PM Modi : మాదిగల రిజర్వేషన్లలకు కాంగ్రెస్‌ అడ్డుపడుతుంది: ప్రధాని మోడీ

Congress Will Block Madiga

Congress Will Block Madiga

Prime Minister Modi: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ(PM Modi) తెలంగాణలోని వేములవాడ(Vemulawada)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం వేములవాడలో బీజేపీ(BJP) నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన రిజర్వేషన్లకు గండికొట్టి కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్‌ అయిన ముస్లింలకు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చిన్నచూపేనని ఫైర్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ చేస్తోన్న రాజకీయాలతో ఓబీసీలకు తీవ్ర నష్టమని హెచ్చరించారు. మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. మన దేశంలో ఎంతో సమర్ధత ఉన్నా ఇన్నేళ్లు కాంగ్రెస్‌ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యల వలయంగా మార్చిందని నిప్పులు చెరిగారు. మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందని సెటైర్ వేశారు. దేశ అభివృద్ధికి అటంకంగా మారిన కాంగ్రెస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

Read Also: Gujjula Premendar Reddy : ఎమ్మెల్సీ బైపోల్.. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

అంతకముందు మోడీ వేములవాడ( శ్రీరాజ‌రాజేశ్వ‌రస్వామి ఆల‌యంలో ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేకంగా నిలిచే కోడె మొక్కుల‌ను ప్ర‌ధాని తీర్చుకున్నారు. అనంత‌రం ప్ర‌ధానిని వేద పండితులు ప్ర‌త్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాల‌ను అంద‌జేశారు. అంత‌కుముందు ఆయ‌న‌ను ఆల‌య అధికారులు, అర్చ‌కులు ప్ర‌త్యేక మెమొంటో, శాలువాతో స‌త్క‌రించ‌డం జరిగింది.