Kapil Sibal : ఎలక్టోరల్‌ బాండ్‌ పథకం..కాంగ్రెస్ ప్రతిస్పందన

    Congress Reaction On Electoral Bonds: నేడు సుప్రీంకోర్టు ఎలక్టోరల్‌ బాండ్‌ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కీలక తీర్పును వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ప్రతిపక్ష నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్యానికి, దేశ పౌరులకు ఆశాకిరణమని రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌(apil Sibal)అన్నారు. బీజేపీ(bjp)ని సంపన్నం చేసేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. అయితే, ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌లో గత కొన్నేళ్లలోనే బీజేపీకి ఐదు నుంచి ఆరువేల కోట్ల […]

Published By: HashtagU Telugu Desk
Kapil Sibal

Kapil Sibal

 

 

Congress Reaction On Electoral Bonds: నేడు సుప్రీంకోర్టు ఎలక్టోరల్‌ బాండ్‌ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కీలక తీర్పును వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ప్రతిపక్ష నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్యానికి, దేశ పౌరులకు ఆశాకిరణమని రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌(apil Sibal)అన్నారు. బీజేపీ(bjp)ని సంపన్నం చేసేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. అయితే, ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌లో గత కొన్నేళ్లలోనే బీజేపీకి ఐదు నుంచి ఆరువేల కోట్ల విరాళాలు వచ్చాయి. వేలకోట్లలో విరాళాలుంటే రాజకీయ పార్టీ మౌలిక సదుపాయాలను సృష్టించుకోవచ్చన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో పార్టీలకు ఎలక్టోరల్​ బాండ్లు(electoral bonds) ఎవరు ఇస్తున్నారనే విషయానని మనం తెలుసుకుంటాం. క్విడ్ ప్రోకో లేకుండా ఎవరూ రాజకీయ పార్టీలకు పది లక్షలకు లేదా 15 లక్షలకు ఎలక్టోరల్ బాండ్​లు ఇవ్వరు. దాని మొత్తం కోట్లలో ఉంటుంది. న్యాయస్థానం తీర్పుతో ఇప్పుడు క్విడ్ ప్రోకో గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం. పార్టీలకు ఎవరైనా ఐదు వేల కోట్ల నిధులు బాండ్ల రూపంలో ఇస్తే వారు అత్యంత ధనవంతుడై ఉండాలి. అలాగే అలా ఆఫర్​ చేసినందుకు వారు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొంది ఉండాలి. అలాగైతేనే ఇలా భారీ స్థాయిలో పార్టీలకు విరాళాలు అందుతాయి. ఎలక్టోరల్​ బాండ్స్​పై సుప్రీం ఇచ్చిన తీర్పు బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడుతుంది. ప్రధాని మోదీ కుంభకోణం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం చేసిన పెద్ద స్కామ్​ (ఎలక్టోరల్​ బాండ్స్​ స్కీమ్​) మీ కళ్ల ముందే కనిపిస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

read also : CAG Report : పింఛన్ల పంపిణీపై అభ్యంతరం..

  Last Updated: 15 Feb 2024, 03:40 PM IST