MLAS CAMP : ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్

కర్ణాటకలో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ఉదయం 11.33 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో, 75 స్థానాల్లో బీజేపీ, 25 స్థానాల్లో జేడీఎస్ లీడ్ లో ఉన్నాయి. ఈనేపథ్యంలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు (MLAS CAMP) అందరికీ కాంగ్రెస్ కర్ణాటక నాయకత్వం ఒక మెసేజ్ పంపింది.

Published By: HashtagU Telugu Desk
Mlas Camp

Mlas Camp

కర్ణాటకలో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ఉదయం 11.33 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో, 75 స్థానాల్లో బీజేపీ, 25 స్థానాల్లో జేడీఎస్ లీడ్ లో ఉన్నాయి. ఈనేపథ్యంలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు (MLAS CAMP) అందరికీ కాంగ్రెస్ కర్ణాటక నాయకత్వం ఒక మెసేజ్ పంపింది. అందరూ ఇవాళ (శనివారం) సాయంత్రం కల్లా బెంగళూరులోని ఒక హోటల్ కు చేరుకోవాలని ఆదేశం జారీ చేసింది. అక్కడి నుంచి ఎమ్మెల్యేలను(MLAS CAMP) చెన్నై లోని మరో హోటల్ లేదా రిసార్ట్ కు తీసుకెళ్లనున్నట్లు చెబుతున్నారు. చెన్నైకి తమ ఎమ్మెల్యేలను తీసుకొస్తున్నామనే సమాచారాన్ని ఇప్పటికే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి కాంగ్రెస్ అధిష్టానం అందించిందని అంటున్నారు.

ALSO READ : PRIYANKA PRAYER : కర్ణాటక కోసం ప్రియాంక పూజలు

సిద్ధరామయ్య.. డీకే శివకుమార్ 

కాంగ్రెస్ 120 సీట్లకు పైగా గెలుస్తుందని ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న సిద్ధరామయ్య అంటుండగా.. 141కిపైగా స్థానాలను పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ డీకే శివకుమార్ అంటున్నారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ శ్రేణులు చాలాచోట్ల సంబురాలు చేసుకుంటున్నాయి. బాణాసంచా కాల్చి, స్వీట్లను పంచుకుంటున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ముఖ్య కార్యాలయంలో కూడా పండుగ వాతావరణం ఉంది.

  Last Updated: 13 May 2023, 11:50 AM IST