మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి(ఎన్డీఏ) (Maharashtra Elections) విజయఢంకా మోగించింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను మించి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ (Congress)పతనాన్ని చూసింది. కేవలం 16 సీట్లకే పరిమితమైంది. 1990లో 141 స్థానాల్లో విజయం సాధించగా, 1995లో 80, 1999లో 75, 2004 లో 69, 2009 లో 82, 2014 లో 42, 2019లో 44 సీట్లను గెలుచుకుంది.
ఇప్పుడు 2024 లో 20 సీట్లలోపే రావడం కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రజల్లో ఆదరణ తగ్గడాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం 20 స్థానాల్లో కూడా గెలవలేక చతికిలబడింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని రీతిలో హస్తం పార్టీ ఆ రాష్ట్రంలో బలహీనపడింది. ఇదే దోరణి కొనసాగితే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
రీసెంట్ గా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 99 స్థానాల్లో దక్కించుకుని బీజేపీకీ పూర్తి అధిక్యాన్ని దక్కకుండా చేయడంలో ముఖ్యభూమిక పోషించిన హస్తం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తేలిపోయింది. పొత్తులో భాగంగా 101 స్థానాల్లో బరిలో నిలిచిన కాంగ్రెస్ కనీసం 20 స్థానాల్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ కూటమి ఘోర ఓటమి చవిచూసింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మరో కారణం ..తెలంగాణ , కర్ణాటక కాంగ్రెస్ గెలుపే అని అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా తర్వాత ఎంత దారుణంగా మారాయనేది ఉదాహరణగా బిజెపి ప్రచారం చేయడం కూడా ఓటర్లలో భయం మొదలైందని తెలుస్తుంది. ఉచిత హామీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్..ఏడాది గడిచిన హామీలు నెరవేర్చకపోవడం , అభివృద్ధి అనేది పూర్తి లేకపోవడం, ఐటీ సైతం పడిపోవడం ఇవన్నీ కూడా ఓటర్లు ఆలోచించేలా బిజెపి చేసింది. ఇది కూడా కాంగ్రెస్ ఓటమికి కారణంగా చెప్పొచ్చు.
Read Also : PM Modi : ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోడీ