CLP meeting: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. ఈ మేరకు నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటాన్‌లో ఈ సమావేశం జరుగునుంది. సమావేశంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ ఇప్పటికే ఆహ్వానం పంపారు. దీంతో ఒక్కొక్కరిగా నగరానికి చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అభిషేక్ సింఘ్వి చేరుకున్నారు.
ముందుగా ఆయన జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సాయంత్రం జరిగే శాసనసభాపక్ష సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆయన మర్యాదపూర్వకంగా కోరనున్నారు. అనంతరం రేపు ఉదయం 11గంటలకు అసెంబ్లీలో సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున హాజరవుతారు.