నా ఫ్యామిలీని టచ్ చేస్తే నరుకుతా – రేణుకా చౌదరి

``స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆశ‌యాల‌కు ఆమె ఆక‌ర్ష‌తుల‌య్యారు. తెలుగుదేశం పార్టీలో చేరి అన్న ఎన్టీఆర్ తో సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణం చేశారు. ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీ లో చేరి సోనియా ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుల‌య్యారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆమె చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి.

  • Written By:
  • Updated On - October 20, 2021 / 11:31 AM IST

“స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆశ‌యాల‌కు ఆమె ఆక‌ర్ష‌తుల‌య్యారు. తెలుగుదేశం పార్టీలో చేరి అన్న ఎన్టీఆర్ తో సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణం చేశారు. ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీ లో చేరి సోనియా ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుల‌య్యారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆమె చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి. తెలుగుద‌నానికి నిలువెత్తు క‌టౌట్ లా క‌నిపించే ఆమె అప‌ర‌కాళిలా పార్ల‌మెంట్ లో ప్ర‌త్య‌ర్థుల మీద విరుచుకుప‌డ‌తారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సూర్ప‌ణ‌ఖ‌లా, పేద‌ల‌కు దేవ‌త‌లా, సామాన్యుల‌కు స‌న్నిహితురాలిగా, తెలుగువారికి ఆడ‌ప‌డుచులా క‌నిపించే ఆమె ఎవ‌రో కాదు…కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌద‌రి. హాష్ ట్యాగ్ యూకు ఆమె ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇలా..“
హాష్ ట్యాగ్ః న‌మ‌స్తే అండీ, రేవంత్ రెడ్డిని పీసీసీగా ఎంపిక చేయ‌డంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి భిన్నంగా వ్య‌వ‌హ‌రించింద‌ని మీరు అనుకుంటున్నారా?
రేణుక‌చౌద‌రిః ఎందుకు, ఆ అనుమానం ఎందుకు వ‌చ్చింది. మారుతున్న ప‌రిస్థితుల‌ను గ్ర‌హించి అందుకు అనుగుణంగా క‌దంతొక్కాలి. అంతేగానీ, ఒకే ఫార్ములా ప్ర‌కారం పోతే క‌ద‌ర‌దు. అన్నీ ఆచితూచి ఆ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిగారు పీసీసీ చీఫ్‌.
హాష్ టాగ్ః  రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ గా ఇచ్చిన త‌రువాత ఆయ‌న్ని టీడీపీ కోవ‌ర్ట్ అని, టీ పీసీసీ కాదు టీడీపీ పీసీసీ అని రోజా తో పాటు ప‌లువురి నుంచి వ‌స్తోన్న ప్ర‌తిస్పంద‌న‌ల‌ను మీరు ఎలా ఫేస్ చేస్తారు?
రేణుకాచౌద‌రిః ఇంత‌లా స్పందిస్తున్నారు అంటే ప్ర‌త్య‌ర్థులు ఎంత భ‌య‌ప‌డుతున్నారో అర్థం అవుతుంది. పీసీసీ ఎంపిక కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం. రోజాకు ఎందుకు..సాటి మ‌హిళగా ఆమెను
గౌర‌విస్తాను. ఆమె గురించి నేను కామెంట్ చేయ‌ద‌ల‌చుకోలేదు. రేవంత్ గురించి ఇంత‌గా భ‌య‌ప‌డుత‌న్నారంటే అన్ని కోణాల నుంచి ఆలోచించి పీసీసీ ఎంపిక‌ను బాగా చేసిన‌ట్టే అని భావించాలి.
హాష్ ట్యాగ్ః ష‌ర్మిల పార్టీ పెడుతున్నార‌ని తెలియ‌గానే..వెంట‌నే పీసీసీగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపిక చేసింద‌ని వైఎస్ విజ‌య‌మ్మ అన‌డాన్ని ఎలా తీసుకుంటారు?
రేణుకాచౌద‌రిః రాజ‌శేఖ‌ర్ రెడ్డి భార్య‌గా విజ‌య‌మ్మ అంటే మాకు గౌర‌వం. ఆమెను కామెంట్ చేయ‌ద‌ల‌చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఆర్ కు లైఫ్ ఇచ్చింది. ఇది నిజం. వారు ఎలా అనుకుంటారో..తెలియ‌దుగానీ..వార‌స‌త్వం అనేది కార్య‌క‌ర్త‌ల నుంచి వ‌స్తుంది. పుట్టుక‌తో వార‌స‌త్వం రాదు. కార్య‌క‌ర్త‌ల‌కు రాజకీయ వార‌స‌త్వం వ‌స్తుందిగానీ, సొంత పిల్ల‌ల‌కు కూడా ఒక్కోసారి రాదు.
హాష్ ట్యాగ్ః వైఎస్ మ‌ర‌ణించిన త‌రువాత ఎఫ్ ఐ ఆర్ లో వైఎస్ పేరు పెట్టారు కాబ‌ట్టి ఆయ‌న‌ చ‌రిష్మా కాంగ్రెస్ పార్టీకి రాద‌ని విజ‌య‌మ్మ అంటున్నారు..మీరేమంటారు?
రేణుకాచౌద‌రిః పాపం విజ‌య‌మ్మ‌గారు ఏవేవో మాట్లాడ‌తారు ఈ టెంలో..వాళ్ల అమ్మాయిని ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి..అవ‌న్నీ నేను ప‌ట్టించుకోను. కానీ, నిజ‌నిజాలు విజ‌య‌మ్మగారికి కూడా తెలుసు.
హాష్ ట్యాగ్ః క్రిష్ణా వాట‌ర్ విష‌యంలో తెలంగాణ‌కు వైఎస్ అన్యాయం చేశాడ‌ని టీ ఆర్ ఎస్ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ పట్టించుకోలేదు. కాబ‌ట్టి వైఎస్ చ‌రిష్మా త‌నకే చెందుతుంద‌న్న ష‌ర్మిల పై మీరేమంటారు?
రేణుకా చౌద‌రిః చూడండి..పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి ఎవ‌రు ఎన్ని అభండాలు వేసినా ఆయ‌న చ‌రిష్మా కాంగ్రెస్ కే ఉంటుంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతిని కాంగ్రెస్ పార్టీలోని కార్య‌క‌ర్త‌లు జ‌రుపుకున్నారు. వాళ్లేదో అన్న‌ట్టు వైఎస్ చ‌రిష్మా కాంగ్రెస్ కు రాద‌నుకోవ‌డమే భ్ర‌మే.
హాష్ ట్యాగ్ ః సోనియాను దెయ్యం అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆమెను దేవ‌త అన‌డం ఏమిట‌ని కేటీఆర్ చేస్తున్న విమ‌ర్శ‌లకు మీ స‌మాధానం?
రేణుకా చౌద‌రిః ఏం ప‌ర్వాలేదు, కేసీఆర్ ఏమ‌న్నారో..తెలంగాణ ఇచ్చిన సోనియాను అంద‌రికీ తెలుసు. త‌ల‌కోసుకుంటామ‌ని ఒక‌సారి ఇంకోసారి ఇంకోలా..ఎన్నో అబ‌ద్దాలు కేసీఆర్ ఆడాడు. వాట‌న్నింటిపైన చ‌ర్చ‌కు కేటీఆర్ చ‌ర్చ‌కు వ‌స్తానంటే నేను సిద్ధం.
హాష్ ట్యాగ్ : మార్పులు గ‌మ‌నించారా?
రేణుకాచౌద‌రిః ఖ‌చ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మార్పు క‌నిపిస్తుంది. కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం, పోరాట ప‌టిమ, నూత‌న ఆనందం ఉంది. ప్ర‌మాణ‌స్వీకారం రోజున కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చిన తీరును గ‌మ‌నిస్తే..ఎవ‌రు కాద‌న్నా అవున‌న్నా..కాంగ్రెస్ పార్టీలో దూకుడు క‌నిపిస్తుంది. నేను అలిగిన, మాట్లాడిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఆనందం, అభిమానం చూస్తే అంతా అర్థం అవుతుంది. ఉయ్ కాంట్ డూ ఎనీ థింగ్
హ్యాష్ టాగ్ యూః గ‌తంలో కోట్ల‌, వైఎస్, డీఎస్, పొన్నాల‌..ఇలా చాలా మంది పీసీసీ చీఫ్ లుగా ప్ర‌మాణస్వీకారం చేశారు. వాళ్లు ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ తేడా క‌నిపిస్తుంది.
రేణుకాచౌద‌రిః ఆనాటి ప‌రిస్థితులు వేరు. అప్పుడు పార్టీలోని స్థితిగ‌తులు వేరు. ఆనాడు ప్ర‌మాణ‌స్వీకారం ఇప్పుడంత ఆర్భాటంగా చేయ‌నంత మాత్రాన వాళ్లు త‌క్కువ కాదు. ఇప్పుడు రేవంత్ ఎక్క‌వ‌ని చెప్ప‌లేం. కానీ, కాంగ్రెస్ పార్టీని స్త‌బ్ద‌త నుంచి బ‌య‌ట‌ప‌డేలా రేవంత్ ప్ర‌మాణ‌స్వీకారం ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.
హ్యాష్ టాగ్ యూః రేవంత్ ప్ర‌మాణ‌స్వీకార ఆర్భాటం చూస్తే, వ్య‌క్తిగ‌త ఫోక‌స్ చేసుకుంటున్నాడు అనిపించ‌డంలేదా?
రేణుకా చౌద‌రిః అది ఎలా కుదురుతుంది. మూడు రంగుల జెండా మెడ‌లో వేసుకున్న త‌రువాత‌…స్వాత్రంత్ర్య తెచ్చిన వార‌సులుగా ప్ర‌జ‌లు గుర్తిస్తున్నారు. ఒక్కో లీడ‌ర్ ది ఒక్కో  స్టైల్ ఉంటుంది. అంత‌మాత్ర‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట కోసం ఇదంతా అని అనుకోలేం. మంత్రి వ‌ర్గంలో కూడా ఒక్కో మంత్రి ఒక్కోలా ప‌నిచేస్తుంటారు. ఈ రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఒక్కోసారి ఒక్కొక‌రు ఉప‌యోగ‌ప‌డ‌తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక పావును కాంగ్రెస్ పార్టీ క‌దిపింది.
హ్యాష్ టాగ్ యూః రేవంత్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారానికి కోమ‌టిరెడ్డి, జీవ‌న్ రెడ్డి రాలేదు. అంటే ఇంకా గ్రూప్ లు ఉన్నాయ‌ని అర్థం క‌దా?
రేణుకా చౌద‌రిః గ్రూపులు అని కాదు. జీవ‌న్ రెడ్డి చాలా మంచి వ్య‌క్తి. చాలా బ్యాలెన్స్ గా ఉంటారు. వివాద‌ర‌హితునిగా ఉంటారు. బ‌హుశా ఆయ‌న ఏదో కార‌ణ‌ల‌చేత రాక‌పోయి ఉండొచ్చు. ఇత‌ర పనులు ఉన్నాయేమో అనుకుంటున్నాను. ఆయ‌న మాతో క‌లిసి ప‌నిచేస్తాడ‌ని నేను వ్య‌క్తిగ‌తం అనుకుంటున్నాను. ఇక కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి డిజ‌పాయిట్మెంట్ ఫీల్ కావ‌డంలో త‌ప్పులేదు. ఫీల్ అవ్వాలి కూడా. ఎందుకంటే ఆయ‌న చాలా సీరియ‌ర్. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ప‌నిచేస్తోన్న లీడ‌ర్. ఫాలోయింగ్ బాగా ఉన్న లీడ‌ర్. ఆయ‌న ప్రొఫ‌యిల్ పీసీసీకి త‌గినదే. ఆయ‌న పీసీసీ చేయ‌లేడ‌ని ఎన్నుకోలేదు అని అనుకోవ‌డం పొర‌బాటు. రియ‌ల్ కాంగ్రెస్ మెన్ కోమ‌టిరెడ్డి. ఒక సీనియ‌న్ కాంగ్రెస్ లీడ‌ర్ గా డిజ‌పాయిట్మెంట్ ను దిగ‌మింగి పార్టీకి ప‌ని చేస్తార‌ని నేను న‌మ్ముతున్నా.
హ్యాష్ టాగ్ యూః కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ ఠాకూర్ పీపీసీ ప‌ద‌విని అమ్మేశార‌ని, టీడీపీ వాళ్లు త‌న ఇంటికి రావొద్ద‌ని కోమ‌టిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు ఉండ‌వా?
రేణుకా చౌద‌రిః అబ్బో..కాంగ్రెస్ పార్టీలో అలాంటి ఉంటే, ఈ దుస్థితికి వ‌చ్చేది కాదు..ఆయ‌న ఏమ‌న్నారో..నాకు తెలియ‌దు. మీడియాలో వ‌చ్చిన‌వి అన్నీ నిజం కాదు. అలా అనుకుంటే నా మీద చాలా వ‌చ్చాయి. ఒక‌టి మాత్రం నిజం కోమ‌టిరెడ్డి క‌మిటెడ్ లీడ‌ర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయ‌న‌కు మంచి భ‌విష్య‌త్ త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని అనుకుంటున్నా.కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కాంగ్రెస్ వీడి వెళ‌తార‌ని నేను అనుకోవ‌డంలేదు. కాంగ్రెస్ పార్టీని స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా ఇప్ప‌టికీ అంద‌రూ ఆద‌రిస్తున్నారు. మా కోసం కాదు..దేశం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల‌ని సామాన్యులు అంటున్నారు.
హ్యాష్ ట్యాగ్ యూః దేశంలో ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌హీనంగా ఉన్నందున అధికార బీజేపీ బ‌లంగా క‌నిపిస్తుందా?
రేణుకా చౌద‌రిః దేశాన్ని క‌న్నింగ్ ప్ర‌భుత్వం ఏలుతుంది. అధికార‌, కండ‌బ‌లంతో ఇష్టానుసారం చేస్తున్నారు. పార్ల‌మెంట్లో, బ‌య‌ట ప్ర‌తిప‌క్షాల‌ను తొక్కేయాల‌ని చూస్తున్నారు. చ‌ట్టాల‌ను సామాన్యుల కోసం తెచ్చాము. వాటిని అడ్డుపెట్టుకుని ప్ర‌తిప‌క్షాల‌ను తొక్కేయాల‌ని చూస్తూ నియంత పాల‌న కొన‌సాగిస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాకు వెళుతుంటే, 144 సెక్ష‌న్ త‌న పై పెట్టారు. ఇప్పుడు దేశానికి అవ‌స‌రం కాంగ్రెస్.
హ్యాష్ టాగ్ యూః సింగిల్ గా కేసీఆర్ ను సీఎల్పీ లీడ‌ర్ భ‌ట్టీ క‌ల‌వ‌డం అనుమానాల‌కు తావివ్వ‌డంలేదా?  మీకు, భ‌ట్టీకి మ‌ధ్య గ్రూప్ లు ఉన్నాయా?
రేణుకా చౌద‌రిః రాజ‌కీయాల్లో అనుమానాలు రావ‌డం స‌హ‌జం. ఏకాంతంగా సీఎంను భ‌ట్టీ ఎందుకు క‌లిశాడో..ఆయ‌న్నే అడ‌గండి. భ‌ట్టీ విక్ర‌మార్క్ ఆయ‌న బ్ర‌ద‌ర్ క‌లిసి ఉంటారు. వాళ్లిద్ద‌రూ ఒకే నిర్ణ‌యం మీద ఉంటారు. వాళ్ల‌నే అడ‌గండి. ఇక నా ఇంటికి వ‌చ్చిన వాళ్లంద‌రూ కాంగ్రెస్ వాళ్లే. అంద‌రూ వ‌స్తారు. రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు తెలిపే రోజున భ‌ట్టీ డిల్లీ వెళ్లాడ‌ని తెలిసింది. నాకు గ్రూప్ అంటూ ఏమీ లేదు. నాది కాంగ్రెస్ గ్రూప్. నా ఇంటికి అంద‌రూ వ‌స్తారు. కొంద‌రు అక్కా అంటారు. ఇంకొంద‌రు అమ్మా అంటారు. ఇంకొంద‌రు ఫైర్ బ్రాండ్ అమ్మా అంటారు. అంద‌రూ నా వాళ్లే. నా గ్రూప్ కాంగ్రెస్.
హ్యాష్ టాగ్ యూః కాస్టింగ్ కౌచ్ పార్ల‌మెంట్లో కూడా ఉందా?  ఫైర్ బ్రాండ్ కూడా అవ‌మానాలు ఉన్నాయా?
రేణుకా చౌద‌రిః పార్ల‌మెంట్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. మ‌హిళ‌ల‌కు స‌మాన‌త్వం అంటారు. ఎక్క‌డ ఉంది చెప్పండి. బాడీ ఒడ్డు పొడుగుల గురించి ఉన్నారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే వాళ్లు, బ‌య‌ట పోరాడే వాళ్లు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు. ఇక చ‌ట్ట స‌భ‌ల్లో 50శాతం మ‌హిళ‌ల‌కు ఇవ్వాల‌ని సోనియా ఉన్నారు. ఇక స్థానిక ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు 50శాతం రిజ‌ర్వేష‌న్లు ఉన్న‌ప్ప‌టికీ భ‌ర్త‌లు అధికారం చేస్తుంటారు. పురుషాధిక్య ప్ర‌పంచంలో ఉన్నాం. ఎన్నో నేను కూడా ఎదుర్కొన్నా. రోడ్ల మీద అడ్డ‌గించి కొంద‌రు అల్ల‌ర్లు చేసి వాళ్లు ఉన్నారు. అవ‌మానాలు, అనుమానాలు ఎదుర్కొన్నా. నా గురించి ఏం మాట్లాడినా ఓకే. మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే న‌రికేస్తా.
హ్యాష్ ట్యాగ్ యూః పీసీసీ మీకు ఇవ్వ‌క‌పోవ‌డంపై మీరు ఫీల్‌ఖ కాలేదా?
రేణుకా చౌద‌రిః నెవ‌ర్‌, నేనెప్పుడూ ప‌ద‌వి కావాల‌ని అడ‌గ‌లేదు. అంద‌రిలా గొర్రులా మంది, పందుల మంద‌లా నేను వెళ్ల‌ను. నాకు ఉండే గౌర‌వం నాకుంది. రేవంత్‌కు నేను రెక‌మెండ్ చేశాన‌న‌డంలో నిజం లేదు. కాంగ్రెస్  అధిష్టానం ఏది చెబితే అది చేసుకుంటూ పోతా. ఏదీ నేను వ్య‌క్తిగ‌తంగా ఆశించ‌డంలేదు.
హ్యాష్ టాగ్ః ప్ర‌ధాని, ఉప రాష్ట్ర‌ప‌తి పార్ల‌మెంట్ లో మీ కామెంట్స్ గురించి ఏమంటారు?
రేణుకా చౌద‌రిః  నా బ‌రువు గురించి వెంక‌య్య‌నాయుడు మాట్లాడి పరుషంగా మాట్లాడు. నాక‌న్నా జూనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ ఆయ‌న‌. సూర్ఫ‌ణ‌ఖ అంటూ నా న‌వ్వు గురించి మోడీ మాట్లాడారు. పార్ల‌మెంట్ హుందాత‌నాన్ని పోగొట్టారు. ఆ రోజు జ‌రిగిన అవ‌మానం గురించి భార‌త మ‌హిళ‌లు గుర్తించారు. ఇలాంటి వాళ్లు వ‌ల్లే రోడ్డు రోమియోలు యువ‌తుల ప‌ట్ల అవ‌మానం ప్ర‌వ‌ర్తిస్తున్నారు. మోడీ  చ‌దువు, సంస్కారంలేని వ్య‌క్త‌ని చెప్ప‌గ‌ల‌ను.
హ్యాష్ టాగ్ః దేశ రాజ‌కీయాల్లో మార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉందా? చ‌ంద్ర‌బాబు రోల్ ఎలా ఉండ‌బోతుంది.?
రేణుకాచౌద‌రిః చంద్ర‌బాబునాయుడు కీ రోల్ పోషించాలి. ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటే దేశానికి ద్రోహం చేసిన వాడిగా మిగిలిపోతాడు. ఇప్పుడు మ‌న గురించి కాదు, భ‌విష్య‌త్ త‌రాల గురించి ఆలోచించాల్సిన స‌మ‌యం ఇది. సీనియ‌ర్ పొలిటిష‌న్ గా అంద‌రినీ స‌మీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆయ‌న బ‌య‌ట‌కొస్తే మంచిది. రావాలి కూడా.రాహుల్ గాంధీకి నాయ‌క‌త్వ లక్ష‌ణాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మార్పు తీసుకురావ‌డానికి రాహుల్ కీల‌కం అవుతారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆత్మ‌ప‌రిశీల‌న కోసం ఉపాస‌న చేస్తాడు. యువ నాయ‌క‌త్వంతో కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా బ‌ల‌ప‌డుతోంది.
మోడీ చ‌రిత్ర‌ను మార్చేస్తున్నాడు. పుస్త‌కాల‌ను మార్చేస్తున్నాడు. ఇదంతా మారాలి..దేశం కోసం అంద‌రూ ఒక‌తాటిపైకి రావాలి. 70ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయ‌పోతే, దేశం ఇప్పుడు ఒకేసారి అభివృద్ధి జరిగ‌లేదు. కాంగ్రెస్ త‌యారు చేసిన ప‌బ్లిక్ రంగం సంస్థ‌ల‌ను మోడీ అమ్ముకుంటున్నారు. ఫైట్ ఫ‌ర్ దిస్ కంట్రీ.
హ్యాష్ టాగ్ యూః రేణుకా చౌద‌రిగారికి సీఎం కావాల‌ని కోరిక లేదా?
రేణుకాచౌద‌రిః లేదు. నిజంగా..నేను సంతృప్తిగా రాజ‌కీయాలు చేస్తున్నా. ఒక వేళ అధిష్టానం అలా ఆలోచిస్తే..ఆ రోజు చూద్దాం. నాకైతే అలాంటి ఆలోచ‌న లేదు. కోరిక కూడా లేదు. రేవంత్ కాబోయే సీఎం, రాహుల్ కాబోయే ప్ర‌ధాని అనే స్లో గ‌న్ మంచిదే. అదే ఉత్సాహంతో క్యాడ‌ర్ ప‌నిచేయాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. సామాన్యుల కోసం..దేశ కోసం మ‌న‌మంద‌రం ఫైట్ చేయాలి.
Watch Full Interview :