Condoms-Wedding Kit : ప్రభుత్వ వెడ్డింగ్ కిట్ లో.. కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు

Condoms-Wedding Kit : "వెడ్డింగ్ కిట్".. ఇందులో ఏముంటాయో మనకు తెలుసు !! అందులో ఏముండాలో అవే ఉంటే.. అది ఇప్పుడు వార్తగా మారేది కాదు !! "వెడ్డింగ్ కిట్" లో  ఉండరాని కొన్ని వస్తువులు అందులో పెట్టారు.. కాబట్టే ఇప్పుడు మనం దానిపై వార్త చదువుతున్నాం.. 

  • Written By:
  • Updated On - May 30, 2023 / 03:11 PM IST

Condoms-Wedding Kit : “వెడ్డింగ్ కిట్”.. ఇందులో ఏముంటాయో మనకు తెలుసు !!

అందులో ఏముండాలో అవే ఉంటే.. అది ఇప్పుడు వార్తగా మారేది కాదు !!

“వెడ్డింగ్ కిట్” లో  ఉండరాని కొన్ని వస్తువులు అందులో పెట్టారు.. కాబట్టే ఇప్పుడు మనం దానిపై వార్త చదువుతున్నాం..   

ఔను.. మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో వధువులకు ఇచ్చిన మేకప్ బాక్సుల్లో కండోమ్‌ ప్యాకెట్లు, గర్భనిరోధక మాత్రలు పెట్టారు.మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2006 ఏప్రిల్ లో ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి ఆడపిల్లల కోసం  సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 296 జంటలకు పెళ్లి జరిగింది. ఈసందర్భంగా ప్రభుత్వం తరఫున వధువులకు  పంపిణీ చేసిన మేకప్ బాక్సుల్లో కండోమ్‌ ప్యాకెట్లు, గర్భనిరోధక మాత్రలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. కుటుంబ నియంత్రణకు సంబంధించిన అవగాహన పెంచేందుకే కండోమ్‌లు, గర్భనిరోధక సాధనాలను మేకప్ బాక్సుల్లో పెట్టామని అధికారులు అంటున్నారు. శుభకార్యం జరిగే టైం లో ఇలాంటివి ఇవ్వడం దేశ సంప్రదాయానికి విరుద్ధం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also read : Aadi Saikumar : ఎయిర్‌పోర్టులో పెళ్లిచూపులు .. హనీమూన్‌లో గొడవ.. ఆది సాయికుమార్ మ్యారేజ్ లైఫ్!

అయితే మేకప్ బాక్సుల్లో ఏముందో తమకు తెలియదని జిల్లా ఉన్నతాధికారి బుర్ సింగ్ రావత్ తెలిపారు. కండోమ్‌లు, గర్భనిరోధక సాధనాలను(Condoms-Wedding Kit) ఆరోగ్య శాఖ అధికారులు .. వధూవరులకు ఇచ్చి ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున  ప్రతి జంటకు  తాము రూ. 49,000 చొప్పున చెక్కును  ఇచ్చామన్నారు. పెళ్లి సందర్భంగా ఆహారం, నీరు, టెంట్ కు అయిన రూ. 6,000 ఖర్చు కూడా తమదేనని బుర్ సింగ్ రావత్ వెల్లడించారు.