Site icon HashtagU Telugu

Comet Close To Earth: ఎవరెస్టు కంటే డబుల్ సైజు తోకచుక్క.. భూమికి దగ్గరగా!!

Comet

Comet

అనగనగా ఒక తోక చుక్క (కామెట్)..

దాని సైజు ఎవరెస్టు పర్వతం కంటే డబుల్..

సౌర మండల వ్యవస్థ అంతర్గత వలయంలోకి ప్రవేశించిన ఈ భారీ తోకచుక్క.. మరో వారం రోజుల్లోగా మన భూమికి కూడా చేరువగా రానుందట. ఈ తోకచుక్కకు ఖగోళజ్ఞులు “కే2” అని పేరు పెట్టారు.

ఇంతకీ కే2 తోకచుక్క మన
భూమికి దగ్గరగా వస్తే .. ఏం జరుగుతుంది ? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తోకచుక్క లోపల నీరు, దుమ్ము ధూళికణాలు, మంచు ఉంటుంది.

సూర్యుడికి చేరువగా ఉండే ధూళి మేఘాలను Oort cloud అంటారు. ఇందులోనే ప్రస్తుతం కే2 తోకచుక్క సహా మరెన్నో తోకచుక్కలు చక్కర్లు కొడుతుంటాయి. కే2 తోకచుక్క Oort cloud నుంచి బయటికొచ్చి సౌర మండల వ్యవస్థలోకి ప్రవేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బహిర్గత గురుత్వాకర్షణ బలాల ప్రభావం వల్ల కే2 తోకచుక్క ప్రయాణం వేగాన్ని పుంజుకొని సూర్యుడి దిశగా కదలాడుతోంది. సూర్యుడికి దగ్గరగా వస్తున్న కొద్దీ కే2 తోకచుక్కలోని మంచు, ఘనీభవించిన నీరు కరిగిపోతోంది. ఈ తరహా మార్పులు జరుగుతున్న సమయంలో తోక చుక్క నెప్ట్యూన్ గ్రహానికి దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. నెప్ట్యూన్ దగ్గరగా ఉండటం వల్ల సూర్య కిరణాలు బాగా ధాటిగా తోక చుక్కపై ప్రసారించడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. వచ్చే వారం ఈ తోక చుక్క భూమికి దగ్గరగా వచ్చినప్పుడు చూడాలంటే టెలిస్కోప్ ఉంటే సరిపోతుంది. నాసా యొక్క వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నడిచే లైవ్ వెబ్ క్యాస్ట్ లో కూడా ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించవచ్చు.