దివ్యాంగులపై లైంగిక దాడి.. కంటతడి పెట్టిన కలెక్టర్.. వైరల్ గా మారిన ఘటన?

ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ కామాంధుల ఆగడాలు మరింత ఎక్కువ అవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 09:00 PM IST

ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ కామాంధుల ఆగడాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రదేశంలో నిత్యం ఏదో ఒక దేశంలో మహిళలు అమ్మాయిలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అయితే కొంత మంది వాటిని ధైర్యంతో ముందుకు వచ్చి చెప్పుకో గా ఇంకొంత మంది మాత్రం చెప్పుకుంటే నలుగురిలో పరువు పోతుంది అని లోలోపల కుమిలిపోతున్నారు. చిన్న పెద్ద పెద్ద అనే తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.

అయితే మామూలు మహిళలకే కాకుండా శరీర అవయవాలను సరిగ్గా లేనివారిని, మతిస్థిమితం లేని వారిని, కళ్ళు సరిగ్గా కనిపించని వారిని ఇలా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కలెక్టర్ ఢిల్లీ రావు ఇబ్రహీంపట్నం అన్నమ్మ దివ్యంగా పాఠశాల లోని అక్కడి దివ్యాంగుల మొరను ఏకంగా కంటతడి పెట్టేశారు. ఆ దివ్యాంగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని, బెదిరిస్తే కొట్టేవారని, పక్కన ఎవరికైనా చెబితే విచక్షణరహితంగా కొట్టేవారని, ఆ చర్యలు చాలా విపరీతంగా ఉండేవి భోజనం కూడా పెట్టేవారు కాదు అని దివ్యాంగులు కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు.

గుణదల విజయమేరీ బ్లైండ్ స్కూల్ లో పునరావాసం పొందుతున్న దివ్యంగా విద్యార్థులతో తాజాగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడారు. వారికి అందిస్తున్న సౌకర్యాలు భద్రత తదితర అంశాల గురించి యాజమాన్యంతో చర్చించి ఆ తర్వాత పాఠశాల ఆవరణలో ఉన్న ఉపాధ్యాయులు యాజమాన్యం పునరావాసం పొందిన విద్యార్థులతో కలిసి ఆయన మాట్లాడారు. అక్కడ జరుగుతున్న అరాచకాలను ఆయన అడిగి మరి తెలుసుకునే, విద్యార్థులు చెప్పిన మాటలు విని కన్నీటిపర్యంతమయ్యారు. దివ్యాంగులు వారి బాధను చెప్పిన తరువాత కలెక్టర్ ఆ విషయం పై కేసు నమోదు చేశామని విచారణ అనంతరం నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా రెవెన్యూ,పోలీస్, శిశుసంక్షేమ, చైల్డ్ లైన్, తదితర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.