Co-living Rooms: కో-లివింగ్ కు ఫుల్ డిమాండ్, హైదరాబాద్ లో స్పెషల్ ప్యాకేజీలు!

కరోనా తర్వాత చాలా మంది ఐటీ ఎంప్లాయిస్ తిరిగి విధుల్లోకి చేరుతున్నాయి. దీంతో ఐటీ సంస్థలు మళ్లీ ఉద్యోగులతో కళకళలాడుతున్నాయి.

  • Written By:
  • Updated On - October 31, 2022 / 05:11 PM IST

కరోనా తర్వాత చాలా మంది ఐటీ ఎంప్లాయిస్ తిరిగి విధుల్లోకి చేరుతున్నాయి. దీంతో ఐటీ సంస్థలు మళ్లీ ఉద్యోగులతో కళకళలాడుతున్నాయి. వేలాది మంది టెక్కీలు షెల్టర్ కోసం వెతుకుతున్నందున హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో (హైటెక్ సిటీ, గచ్చిబౌలి,  మాదాపూర్) కో-లివింగ్ స్పేస్‌ల కోసం డిమాండ్ పెరుగుతోంది. సరసమైనవి, అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుండటం, మాల్స్, రెస్టారెంట్స్ తమ ఆఫీసులకు దగ్గర ఉండటంతో యువ టెక్కీలు హాస్టళ్లు, అద్దె గదుల కంటే కో లివింగ్ రూమ్స్ ను ఎక్కువగా ఇష్టపడతున్నారు.

కో-లివింగ్ అనేది రెసిడెన్షియల్ కమ్యూనిటీ లివింగ్ మోడల్. ఒకే రకం అభిరుచులు, అలవాట్లు ఉన్న వ్యక్తులు గదులను షేర్ చేసుకుంటున్నారు. కో-లివింగ్ స్పేస్‌ల కోసం అధిక డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు అనేక ఏజెన్సీలు కొత్త వెంచర్‌లతో ముందుకు వచ్చాయి. ప్రతి వ్యక్తికి నెలకు రూ. 8,000 నుండి రూ. 15,000 వరకు వసూలు చేస్తూ ఇష్టమైన లివింగ్ రూమ్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. సహ-జీవనం అనేది నేటి ట్రెండ్. మిలీనియల్స్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. “హైదరాబాద్‌లో ఐటీ కారిడర్స్ ఏరియాలు లివింగ్ రూమ్స్ కు అనుకూలంగా ఉన్నాయి. అంతేకాదు.. నిర్వాహకులు మంచి మంచి వసతులను తీర్చిదిద్దుతున్నారు. తక్కువ టైంలోనే ఆఫీసులకు వెళ్లొచ్చు అంటూ ఓ అమ్మాయి చెబుతోంది. దాదాపు 90 శాతం మంది 25, 35 టెకీలు కోలివింగ్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

బెంగళూరుకు చెందిన సంస్థ హైదరాబాద్‌లో మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లో 300 పడకలతో కూడిన ఐదు సహ-జీవన కేంద్రాలను నిర్వహిస్తోంది. నెలకు ఒక్కో బెడ్‌కు కంపెనీ రూ.9000 నుంచి రూ.12,000 వరకు వసూలు చేస్తుంది. కో-లివింగ్ ఇన్ ఇండియా’లో 2021 చివరి నాటికి 2.1 లక్షలతో పోలిస్తే 2024 నాటికి కో-లివింగ్‌లో పడకల సంఖ్య 4.5 లక్షలకు చేరుకుంటుందని సమాచారం.