Site icon HashtagU Telugu

Yogi Adithyanath: చిరుతకు పాలు తాగించిన సీఎం…వీడియో వైరల్..!!

Up

Up

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ అష్పక్ ఉల్లాఖాన్ జువలాజికల్ పార్క్ ను వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తెల్లపులి గీతను, రెండు హిమాలయ కృష్ణ ఎలుగుబంట్లను జూలో విడిచిపెట్టారు. రెండున్నరనెలల క్రితం ఈ పులిని జూకు తీసుకువచ్చిన్నట్లు అధికారులు తెలిపారు.

అంతకుముందు సీఎం యోగి ఆదిత్యానాథ్ ఓ చిరుతకు పాలుపట్టించారు. గోరఖ్ పురలోని వెటర్నరీ ఆసుపత్రి వైద్యుడు యోగేశ్ సింగ్ పర్యవేక్షణలో ఉన్న చిరుతను ఒడిలోకి తీసుకుని పాలు తాగించారు. తర్వాత రెండు చిరుతలకు చంఢీ, భవాని అని నామకరణం చేశారు. అనంతరం వాటిని గోరఖ్ పూర్ జులాజికల్ పార్క్ కు తరలించారు.