Site icon HashtagU Telugu

CM Revanth Reddy : ఆదివాసి సంఘాలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

CM Revanth Reddy Meet with tribal communities

CM Revanth Reddy Meet with tribal communities

Tribal communities : సీఎం రేవంత్ రెడ్డితో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాలు భేటీ అయ్యాయి. జూబ్లీహిల్స్ లోని సీఎం అధికారిక నివాసంలో బుధవారం భేటీ అయిన పలు సంఘాల ప్రతినిధులు..తమ ప్రాంత సమస్యలను సీఎం కి వివరించారు. జైనూరు ఘటన దరిమిలా ఆదివాసులు, మైనారిటీ వర్గాల మధ్య సఖ్యత కుదుర్చేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇరు వర్గాలతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవ తీసుకొని ఆదివాసి సంఘాలను తొడ్కొని సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ సమస్యలను ఆదిలాబాద్ ఆదివాసి సంఘాల ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. స్థానికంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ వినతి పత్రాలు అంద చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Read Also: PM Modi : ప్రధాని మోడీని కలిసిన హర్యానా సీఎం యాబ్ సింగ్ సైనీ

తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని కోరారు. ఆదివాసీల సమస్యలు సావధానంగా విన్న రేవంత్ రెడ్డి..దీపావళి లోపు సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి ఆదివాసి సంఘాలను, ముఖ్యలను ఆహ్వానిస్తామని, ఆ సమావేశంలోనే ఆదివాసీల డిమాండ్ల సాధ్యసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆదివాసి సంఘాలకు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్ గా పనిచేసి అక్కడి సమస్య పట్ల పూర్తి అవగాహన ఉన్న దివ్య దేవరాజన్ ను అక్కడికి పంపించి చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించెందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నందున ప్రభుత్వానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసి సంఘాల ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, సమస్యను పరిష్కరించే దిశలో చూపి సీఎంతో సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణకు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: Jawans Kidnapped : ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. ఒక జవాన్ హత్యతో కలకలం