Site icon HashtagU Telugu

Revanth Reddy : ఢిల్లీకి పయనమైన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy left for Delhi

CM Revanth Reddy left for Delhi

Revanth Reddy: ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali)ఇంట్లో రంజాన్(Ramadan)వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ఢిల్లీ(Delhi)కి పయనమయ్యారు. ఈ సాయంత్రం ఏఐసీసీ(AICC) పెద్దలతో ఆయన భేటీకానున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 10కి పైగా స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, లోక్ సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో సత్తా చాటాలని రేవంత్ కృతనిశ్చయంతో ఉన్నారు.

Read Also:Volunteer System : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం

కాగా, వ‌చ్చే నెల 13న తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఈ నెల 14 నుంచి ఎన్నిక‌ల ప్రచారానికి తెర‌లేప‌నున్నారు సీఎం రేవంత్. ప్రతి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ పరిధిలో మూడుకు త‌గ్గకుండా బ‌హిరంగ స‌భ‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్‌లతో పాటు రోడ్ షోలు నిర్వహించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు సీఎం రేవంత్.

ఇప్పడికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో బీఆర్ఎస్, బీజేపీ నేత‌ల‌ను హ‌స్తం గూటికి చేర్చుకుంటున్నారు. ఇంకా బీఆర్ఎస్‌ పార్టీలో కీల‌కంగా ఉన్న నేత‌ల‌ను లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్‌లోకి రాకపోయినా.. బీఆర్ఎస్‌లో సైలెంట్‌గా ఉండేలా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు రేవంత్ రెడ్డి.

Read Also:Naga Chaitanya : హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి నాగ చైతన్య నో ఎందుకు చెప్పాడు..?

ప్రతి పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గంపై ప్రత్యేకంగా ఫోక‌స్ చేస్తూ.. కొత్త, పాత నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వయం ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ప్రచారంలో వంద రోజుల పాల‌నను ప్రజ‌ల్లో తీసుకెళ్తూనే… ప‌దేళ్ల బీఆర్ఎస్, బీజేపీ వైఫ‌ల్యాల‌ను వివ‌రించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పడికే ప్రతి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక స‌మ‌న్వయ క‌ర్తను నియ‌మించారు. వాళ్లు హైద‌రాబాద్, ఢిల్లీలోని వార్ రూమ్‌ల‌కు ట‌చ్‌లో ఉంటూ ఎప్పటిక‌ప్పుడు అభ్యర్థి గెలుపుపై స‌ర్వేల‌ను అంద‌చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు.