Site icon HashtagU Telugu

Marathon : జమ్మూకశ్మీర్‌ తోలి మారాథాన్‌ను ప్రారంభించిన సీఎం ఒమర్‌ అబ్దుల్లా

CM Omar Abdullah inaugurated the Jammu and Kashmir Marathon

CM Omar Abdullah inaugurated the Jammu and Kashmir Marathon

Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తొలి మారథాన్ జరిగింది. ఉదయం జెండా ఊపి మారథాన్ ను ప్రారంభించిన సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరిగెత్తారు. ఈ మారథాన్ లో సీఎంతో పాటు.. 13 దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తోన్న 2 వేల మంది అథ్లెట్లు, 35 మంది స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు. కశ్మీర్ లోయలో జరిగిన తొలి ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇదే కావడం విశేషం.

మారథాన్‌లో చురుకుగా పాల్గొన్న ఒమర్‌ అబ్దుల్లా అందరి దృష్టిని ఆకర్షించారు. ఎలాంటి శిక్షణ, ప్రణాళిక లేకుండా తాను ఈ మారథాన్‌లో పాల్గొన్నట్లు సీఎం ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. మారథాన్ లో పరిగెత్తిన సీఎం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన జీవితంలో 13 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఎప్పుడూ పరిగెత్తలేదన్నారు. ఈ రోజు నిర్వహించిన మారథాన్ లో ఎన్నో వేలమంది పాల్గొనడంతో.. వారితోపాటు ఉత్సాహంగా మారథాన్ లో రన్ చేశానన్నారు. భవిష్యత్ లో కశ్మీర్ మారథాన్ ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెటిక్ ఈవెంట్లలో ఒకటిగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. 90 స్థానాల శాసనసభలో ఎన్‌సీ 42 సీట్లలో, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో నెగ్గింది. ముఖ్యమంత్రిగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

Read Also: Maharashtra Elections : మహారాష్ట్ర పోల్స్.. 99 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్