Site icon HashtagU Telugu

Odisha : ఒడిశాలో సీఎం నవీన్‌ పట్నాయక్‌ వెనుకంజ

Cm Naveen Patnaik Is Laggin

CM Naveen Patnaik is lagging behind in Odisha

Election Results 2024 : ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ పార్టీ బిజూ జనతా దళ్(బీజేడీ) జైతయాత్రకు బీజేపీ బ్రేకులు వేయనున్నట్లు ఫలితాల ట్రెండ్‌ సూచిస్తుంది. 2000 సంవత్సరం నుండి సీఎం కొనసాగుతున్న నవీన్‌ పట్నాయక్‌ ఈ సారీ పదవికి దూరం కానున్నారు. ఫలితాల్లో 73 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్‌ లో కొనసాగుతుండగా.. బీజేడీ అభ్యర్థులు కేవలం 50 చోట్ల ముందంజలో ఉన్నారు. కాంటాబంజి లో సీఎం 1,158 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన రెండో స్థానం హింజిలిలో మాత్రం స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు 147 లోక్‌సభ స్థానాలు ఉన్న ఒడిశాలో.. ప్రస్తుతం బీజేపీ 74 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేడీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 13, ఇత‌రులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 74.. ఈ నేపథ్యంలో బీజేపీ 73 చోట్ల లీడ్ లో కొనసాగుతుండడంతో ఒడిశాలో ఈసారి అధికార మార్పిడి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ భారీగా నమోదైంది. మొత్తంగా 74.4 శాతం ఓటింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ 73.20 శాతమే. గత ఎన్నికల్లో బీజేడీ 113 సీట్లు గెలుచుకోగా బీజేపీ 23 స్థానాలు, కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితమయ్యాయి.

Read Also:  AP Results 2024: 18 స్థానాల్లో జనసేన ఆధిక్యం