Kejriwal: ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో తనకు బదులుగా మంత్రి అతిషి పోల్గొంటారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సెనాను సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఏడాది ఆగస్ట్ 15వ తేదీన ఛత్రసాల్ స్టేడియం వేదికగా కేజ్రీవాల్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహరంలో ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన తీహాడ్ జైలుల్లోనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. తాను ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం పూర్తికాగానే సీఎం కేజ్రీవాల్ మళ్లీ జైల్లోకి వెళ్లిపోయారు. నాటి నుంచి ఆయన తీహాడ్ జైల్లోనే ఉన్నారు.
అలాంటి పరిస్థితుల్లో మరో వారం రోజుల్లో జెండా పండగ వేడుకల్లో ఎవరు పాల్గొంటారంటూ ఓ చర్చ సైతం మొదలైంది. ఆ క్రమంలో మంత్రి అతిషి పేరును పార్టీలోని నేతలు తెరపైకి తీసుకు వచ్చినట్లు సమాచారం. అదీకాక ప్రభుత్వ పరంగా ఏమైనా నిర్ణయాలు వెల్లడించాల్సి ఉన్నా.. మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరగాలన్నా అతిషి ముందుంటారనే విషయం అందరకి తెలిసిందే. దీంతో స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. త్రివర్ణ పతాకం ఎగుర వేసే బాధ్యతలు ఆమెకు అప్పగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మరి దీనిపై ఢిల్లీ ఎల్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురు చూస్తుంది.