భూమి వైపు “సిటీ కిల్లర్” (City killer) అనే పేరు పొందిన ఒక గ్రహశకలం (Asteroid 2024 YR4) దూసుకొస్తోంది. నాసా తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. ఈ గ్రహశకలం 2032 డిసెంబర్ 22న భూమిని ఢీకొట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇది భూమిపై పడే అవకాశమున్న ఐదు ప్రధాన ప్రాంతాల్లో భారతదేశానికి చెందిన ముంబై, కోల్‌కతా నగరాలు కూడా ఉన్నాయి. ఈ గ్రహశకలం 40 నుంచి 90 మీటర్ల పరిమాణంలో ఉన్నప్పటికీ, ఇది భూమిపై పడితే ఒక నగరం మొత్తం నాశనం అయ్యేంత ప్రమాదకరమని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
India’s Smallest Passenger Train : కేవలం 9 కి.మీ నడిచే ట్రైన్ ఉందని మీకు తెలుసా..?
2024 YR4 గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాన్ని మొదట ‘1%’గా అంచనా వేయగా.. ప్రస్తుతం ఇది ‘3.1%’కి పెరిగిందని నాసా వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా భూమిపై ఒక మహానగరం పూర్తిగా కాలిపోవచ్చు. ప్రధానంగా తూర్పు పసిఫిక్, ఉత్తర, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికా, అరేబియా సముద్రం, దక్షిణాసియ ప్రాంతాలు ఈ విపత్తుకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరింత భయపెట్టే విషయం ఏమిటంటే.. భూమిని ఢీకొట్టకపోయినా, ఇది వాయు విస్ఫోటనం రూపంలో భారీ విధ్వంసానికి కారణమయ్యే అవకాశం ఉంది.
KCR : హరీష్ రావు చేతికి కీలక బాధ్యతలు
ఈ ప్రకటన ఇప్పుడు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్తులో నాసా, ఇతర అంతరిక్ష పరిశోధనా సంస్థలు దీని గురించి మరిన్ని అధ్యయనాలు చేస్తూ, దీని మార్గాన్ని మళ్లించగలిగే ప్రయత్నాలు చేపట్టే అవకాశం ఉంది. గతంలో ఇటువంటి గ్రహశకలాలను భూమికి తాకకుండా తిప్పి పంపిన నాసా, ఇప్పుడు కూడా అదే విధంగా రక్షణ చర్యలు తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ “సిటీ కిల్లర్” భూమిని వదిలిపెడుతుందా, లేక విపత్తును తెచ్చిపెడుతుందా అనే విషయానికి సమాధానం కాలమే చెప్పాలి.