Site icon HashtagU Telugu

Death Sentence : ఆ మెసేజ్ షేర్ చేశాడని ఉరిశిక్ష

Death Sentence

Death Sentence

మరణ శిక్ష..  ఎందుకు విధించాలి  ? ఎలాంటి కేసుల్లో విధించాలి ?

తీవ్రమైన నేరాలకే మరణ శిక్ష విధించాలని చట్టాలు చెబుతున్నాయి. 

 కానీ పాకిస్తాన్ వంటి కొన్ని దేశాల్లో చట్టాలు అరాచకంగా ఉన్నాయి.

ఒక మెసేజింగ్ యాప్‌లో దైవ దూషణకు సంబంధించిన విషయాలను షేర్ చేశాడనే అభియోగాలను ఎదుర్కొంటున్న ఓ యువకుడికి మరణశిక్ష (Death Sentence) పడింది. నౌమాన్ మాసిహ్ అనే 19 ఏళ్ళ కుర్రాడికి పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్ సిటీలోని జిల్లా సెషన్స్ కోర్టు ఈ శిక్ష (Death Sentence )విధించింది. రూ.20,000 జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది. నాలుగేళ్ల క్రితం నౌమాన్ మాసిహ్ ను అరెస్ట్ చేయగా.. తాజాగా ఈమేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Also read : Ex-Minister Son: హిజ్రాలను హత్య చేసిన కేసులో మాజీమంత్రి కుమారుడికి ఉరిశిక్ష

“నౌమాన్ మాసిహ్ సెల్‌ఫోన్ ఫోరెన్సిక్ రికార్డును చెక్ చేయగా.. వాట్సాప్ ద్వారా దైవదూషణ కంటెంట్‌ను షేర్ చేశాడని రుజువు అయింది” అని ఒక అధికారి తెలిపారు. అతడికి వ్యతిరేకంగా మరికొందరు సాక్షులు కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారని వెల్లడించారు. ఈ సంవత్సరం మే 7న ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ ర్యాలీలో.. దైవదూషణ వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని జనం కొట్టి చంపారు.