Site icon HashtagU Telugu

Chiru- ANR National Award 2024 : మోహన్ బాబుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి

Chiru Mohanbabu Anr

Chiru Mohanbabu Anr

ANR జాతీయ అవార్డు ఫంక్షన్‌ (ANR National Award 2024) హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studio) లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి , బిగ్ బి , రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌, సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత , రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది హాజరై సందడి చేసారు. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డును చిరంజీవికి ప్రకటించిన నాగార్జున.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకున్నారు.

అనంతరం చిరంజీవి (Chiranjeevi Speech on ANR National Award 2024) మాట్లాడుతూ..వజ్రోత్సవాల వేడుకలో జరిగిన విషయాన్నీ గుర్తు చేసారు. వజ్రోత్సవాల సందర్భంగా తనకు లెజెండరీ అవార్డు ఇచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించడంతో, ఆ అవార్డును తీసుకోకుండా క్యాప్సూల్ బాక్సులో ఉంచిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో గెలవలేకపోయాననే అసంతృప్తి, పద్మ విభూషణ్ వంటి ఎన్నో అవార్డులు వచ్చినా, చిరంజీవికి అప్పట్లో అంత సంతృప్తి కలగలేదని తన భావాలను పంచుకున్నారు. అయితే, ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) జాతీయ అవార్డును అందుకున్న ఈ ప్రత్యేక రోజున, అదే తన మిత్రుడు నాగార్జున ఈ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా తనకు అందించడంలో ఆనందం పంచుకుంటూ, “ఇప్పుడు నాకు ఇంట గెలిచిన అనుభూతి కలుగుతోంది,” అని ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఆయన “ఇంటా గెలిచాను, రచ్చా గెలిచాను” అంటూ తన విజయాన్ని గొప్పగా తెలియజేశారు.

Read Also : Vidadala Rajini : జనసేనలోకి విడదల రజిని..?