Site icon HashtagU Telugu

Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

Corona

Corona

బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలిసిందే. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలను ముందుగానే ఊహించి రాసుకొచ్చారు. బ్రహ్మంగారి చెప్పిన విధంగానే ఇప్పటికే ఎన్నో విషయాలు కూడా జరిగాయి. కాగా కరోనా వస్తుంది అన్న విషయాన్ని తన కాలజ్ఞానంలో పొందుపరిచిన విషయం తెలిసిందే. బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేసి కోట్లాదిమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అలా బ్రహ్మంగారి మాదిరే ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తును ముందే ఊహించి చెప్పినవాడు నోస్ట్రాడమస్.

అయితే 465 సంవత్సరాల క్రితమే వేల అంచనాలతో లెస్ ప్రాపర్టీస్ అనే పుస్తకాన్ని వెలువరించినాడు. కాగా ఆయన చెప్పిన వాటిలో కూడా ఇప్పటివరకు కొన్ని నిజమయ్యాయి. అలాంటి జ్యోతిషుడే చైనాలోనూ ఉన్నాడు. ఆయన పేరు లియూ బోవెన్‌. ద టెన్‌ వర్రీస్‌ అనే పేరుతో ఉన్న కవితలో ఆయన భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ముందే లికించడం జరిగింది. అందులో కరోనా పుట్టుకను, అంతాన్ని కూడా ఆయన అంచనా వేశారు. అది కచ్చితంగా కరోనా అనే ఎలా చెప్పగలరంటే ర్యాట్, క్యా­ట్‌ ఇయర్స్‌ మధ్య కాలంలో భయంకరమైన విపత్తు వస్తుందని, అది డ్రాగన్, స్నేక్‌ ఇయర్స్‌ మధ్యకాలంలో అంతమైపోతుందని ఆయన పేర్కొన్నాడు.

చైనీస్‌ జొడియాక్‌ సంవత్సరాల ప్రకారం ర్యాట్‌ ఇయర్‌ 2019 ఫిబ్రవరి న మొదలైంది. పిగ్‌ ఇయర్‌ 2020 జనవరి 25న ప్రారంభమైంది. ఈ రెండేళ్ల మధ్య పుట్టిన విపత్తే కరోనా వైరస్. చైనాలోని వుహాన్‌ లో 2019 డిసెంబరు 1న తొలి కేసును గుర్తించారు. అది ఆయన చెప్పిన రెండేళ్ల మధ్య కాలం. కరోనా అంతమైపోతుందని ఆయన చెప్పిన సంవత్సరాలు డ్రాగన్‌ 2024లో ప్రారంభమవుతుంది. స్నేక్‌ 2025లో మొదలవుతుందట. ఈ 2024 నుంచి 2025 మధ్య కాలంలోనే పూర్తిగా కరోనా నశిస్తుందని ఆయన తెలిపాడు. ఆయన చెప్పిందే నిజమవుతోందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలేమీ లేకపోవడంతో ఆ కవిత బోవెన్‌ రాసినట్టు ఆధారాలు కూడా ఏమీ లేవన్న విమర్శ కూడా ఉంది.