Rice In Space: అంతరిక్షంలో వరి పండించిన చైనా శాస్త్రవెత్తలు.. వీడియో మీరు చూశారా?

ఇప్పటివరకు కేవలం మనం భూమి మీద మాత్రమే వరిని, లేదా ఇతర పంటలను పండించడం చూసి ఉంటాం. కానీ చైనా

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 08:15 PM IST

ఇప్పటివరకు కేవలం మనం భూమి మీద మాత్రమే వరిని, లేదా ఇతర పంటలను పండించడం చూసి ఉంటాం. కానీ చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఏకంగా అంతరిక్షంలోని వరిని పండించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం సత్యం. కాగా చైనా దేశం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్న క్రమంలోని చైనా పలు సైన్స్ ప్రయోగాలను ప్రారంభించింది. ఇక అందులో భాగంగానే జీరో గ్రావిటీ ల్యాబ్ లో వరి మొక్కలను విజయవంతంగా పెంచారు.

ఇందుకు సంబంధించిన ప్రయోగాన్ని ఈ ఏడాది జూలైలో ప్రారంభించగా,ఇందుకోసం వారు రెండు రకాల విత్తనాలు తీసుకున్నారట. థాలేక్రెస్‌ అనే క్యాబేజ్‌ జాతికి చెందిన విత్తనం తో పాటుగా వరికి సంబంధించిన విత్తనాలతో స్పేస్‌ స్టేషన్‌లోని వెంటియన్‌ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలను చేశారట. ఈ మేరకు చైనా వ్యోమోగాములు అంతరిక్షంలోని కృత్రిమ వాతావరణంలో ఈ విత్తనాల నుంచి మొక్కలను విజయవంతగా పెంచింది. ఐతే థాల్స్‌క్రేస్‌ నాలుగు ఆకులు ఉత్పత్తి చేయగా, పొడవాటి కాండంతో వరి మొక్కలు సుమారు 30 సెంటి మీటర్ల వరకు పెరిగాయి.


అయితే రేడియోషన్‌ స్థాయిలు అధికంగా ఉండే అంతరిక్షంలో మొక్కలు ఏవిధంగా ఉంటాయి అన్నది తెలుసుకోవడానికి చైనా టైకోనాట్స్‌ ఈ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే చైనా అంతరిక్షంలో మొక్కలు పెంచడం అన్నది ఇదేమి తొలిసారి కాదు. గతేడాది జూలైలో చాంగ్‌ 5 అనే మిషన్‌తో ఒక వ్యొమోగామి బృందం వరి మొక్కను పెంచింది. ఈ మేరకు చైనా అంతరిక్షంలో తాము మొక్కలను ఏవిధంగా పెంచామో వివరించేలా ఒక వీడియోని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.