Site icon HashtagU Telugu

Solar Power Plant : ఆకాశంలో చైనా సోలార్ ప్లాంట్.. అక్కడి నుంచి విద్యుత్ భూమికి !

Solar Storm

Solar System

చైనా రూటే సెపరేటు.. దాని స్పీడే యమ స్పీడు! సోలార్ పవర్ ప్లాంట్లను మనం ఇప్పటివరకు భూమిపై చూశాం. 2028 సంవత్సరంలోగా అంతరిక్షంలోనూ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని చైనా ప్రకటించింది. భూమిపై ఉండే సోలార్ ప్లాంట్ లో తయారయ్యే విద్యుత్ ను మానవ అవసరాలకు వినియోగిస్తున్నారు. మరి అంతరిక్షంలో పెట్టే సోలార్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్ ను ఎందుకు వాడుతారు? దాంతో ఏం చేస్తారు ? అంటే.. అంతరిక్షంలో వివిధ కక్ష్యల్లో తిరిగే ఉపగ్రహాల కరెంటు అవసరాలను తీర్చేందుకు ఆ సోలార్ పవర్ ను వినియోగిస్తారు. సౌర విద్యుత్ ను తొలుత సాధారణ కరెంట్ గా, ఆ తర్వాత మైక్రో వేవ్ లుగా మార్చి భూమికి పంపే పరిజ్ఞానం కూడా చైనా ఏర్పాటు చేయనున్న అంతరిక్ష సోలార్ ప్లాంట్ లో ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఈవిధంగా సోలార్ ప్లాంట్ పనిచేయగలిగితే అది పెద్ద అద్భుతమే అవుతుంది.అంతరిక్ష సోలార్ ప్లాంట్ సామర్ధ్యం 10 కిలోవాట్లు. దీనికి సంబంధించిన నమూనా ప్లాంట్ ను చైనాలోని శిడియన్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసి, పనితీరును పరీక్షిస్తున్నారు. ఇది 75 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంతరిక్ష జియో స్టేషనరీ ఆర్బిట్ లో ఈ సోలార్ ప్లాంట్ ను చైనా ఏర్పాటు చేయనుంది. చైనా లోని చొంగ క్వీన్గ్ నగరంలో 33 ఎకరాల విస్తీర్ణంలో అంతరిక్ష సోలార్ పవర్ ప్లాంట్ నమూనా ను ఏర్పాటు చేసి అధ్యయనం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అంతరిక్షం నుంచి భూమికి మైక్రో వేవ్ రూపములో విద్యుత్ ను పంపితే ఏవైనా అనర్ధాలు ఉంటాయా ? మైక్రో వేవ్ రేడియేషన్ సంభవిస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు చైనా ప్రయత్నించనుంది.