Mars Mission: నాసా కంటే ముందే భూమికి అంగారకుడి శాంపిల్స్ తెస్తాం : చైనా

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ "నాసా"కు ధీటుగా అంగారకుడి పై ప్రయోగాలను వేగవంతం చేస్తామని చైనా ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - June 24, 2022 / 09:30 AM IST

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ “నాసా”కు ధీటుగా అంగారకుడి పై ప్రయోగాలను వేగవంతం చేస్తామని చైనా ప్రకటించింది. నాసా కంటే రెండు, మూడేళ్ళ ముందే అంగారకుడి ఉపరితలంపై నుంచి మట్టి, రాళ్ళ శాంపిళ్ళను సేకరించి భూమికి తీసుకొస్తామని వెల్లడించింది. “టియాన్ వెన్-3” అనే మార్స్ ఆర్బిటర్ ను 2028లో చైనా అంగారకుడి పైకి పంపనుంది. దీని ద్వారా పంపే రోవర్ అంగారకుడిపై దిగి శాంపిల్లను సేకరించి, 2031 సంవత్సరంలోగా భూమికి పంపిస్తుంది. వాస్తవానికి 2028లో రెండు కాంబినేషన్లలో ఈ ప్రయోగాన్ని చైనా చేపట్టనుంది. ఒక కాంబినేషన్లో ల్యాండర్ తో పాటు అసెంట్ వెహికిల్ ఉంటుంది. ఇంకో కాంబినేషన్లో ఆర్బిటర్ తో పాటు రిటర్న్ మాడ్యూల్ ఉంటుంది.

రెండు కాంబినేషన్లలో..

లాంగ్ మార్చ్ 5, లాంగ్ మార్చ్ 3బీ అనే రెండు రాకెట్ల ద్వారా ఈ రెండు కాంబినేషన్లను అంగారకుడి పైకి పంపుతారు. ప్రయోగించిన ఏడాది తర్వాత (2029లో) ఇవి అంగారకుడి పై ల్యాండ్ అవుతాయి. మొదటి కాంబినేషన్ లోని అసెంట్ వెహికిల్ .. అప్పటికే అంగారకుడి కక్ష్యలో ఉన్న టియాన్ వెన్-1 ఆర్బిటర్ వ్యోమ నౌక తో అనుసంధానం అవుతుంది. 2030 అక్టోబర్ లో అంగారకుడి శాంపిల్లతో కూడిన వ్యోమనౌక భూమికి బయలుదేరుతుంది. టియాన్ వెన్-1 ఆర్బిటర్ వ్యోమ నౌక ను 2020 జూలైలోనే చైనా ప్రయోగించింది. 2021 ఫిబ్రవరి 10న ఇది అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది.