Viral Video: కక్కుర్తి లో పీహెచ్డీ చేసిన చింపాంజీ

అందుకు కక్కుర్తిలో మనుషులను మించిన రేంజ్ లో ప్రవర్తించింది.ఈ వీడియోను చూస్తే.. అదంతా తెలిసిపోతుంది.

Published By: HashtagU Telugu Desk
Chimpanzee

Chimpanzee

అందుకు కక్కుర్తిలో మనుషులను మించిన రేంజ్ లో ప్రవర్తించింది.ఈ వీడియోను చూస్తే.. అదంతా తెలిసిపోతుంది. ఒక వ్యక్తి పండ్లు వేస్తే.. కొన్ని చింపాంజీలు పరుగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్లాయి. ఓ చింపాంజీ మాత్రం అత్యాశను చాటుకుంది. ఈసారి పండ్లను తీసుకెళ్లి దాచుకోకుంటే.. జీవితాంతం పస్తులు ఉండాల్సి వస్తుందన్నట్టు ప్రవర్తించింది. శాయశక్తులా ప్రవర్తించి .. చేతులన్నీ నింపుకొని మరీ పండ్లను తన డెన్ వరకు మోసుకెళ్లింది. రెండు చేతుల్లో .. నోటితో.. కాలి వేళ్ల మధ్యలో కూడా పెట్టుకుని పండ్లను చింపాంజీ తీసుకెళ్లే వీడియో చూస్తే పొట్ట చెక్కలు అయ్యేంత నవ్వు రాక మానదు. నడవటానికి ఇబ్బందిగా ఉన్న.. పండ్లను అది ఎత్తుకెళ్లిన తీరు నవ్వులు పూయించక మానదు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

 

https://twitter.com/buitengebieden/status/1545054274987577344

  Last Updated: 09 Jul 2022, 04:28 PM IST