Viral Video: తాబేలుతో ఫుడ్ షేర్ చేసుకున్న చింపాంజీ.. వీడియో వైరల్!

జంతువుల మధ్య కూడా స్నేహ సంబంధం ఉంటుంది.. అవి కూడా ఫుడ్ ఐటమ్స్ ను షేర్ చేసుకొని తింటాయి

Published By: HashtagU Telugu Desk
Chimpanzee

Chimpanzee

జంతువుల మధ్య కూడా స్నేహ సంబంధం ఉంటుంది.. అవి కూడా ఫుడ్ ఐటమ్స్ ను షేర్ చేసుకొని తింటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. ఓ చింపాంజీ.. తాబేలుతో స్నేహం చేసింది. తన వద్ద ఉన్న యాపిల్ ను తాబేలుతో పంచుకుంది. ఈ వీడియోలో ఆపిల్ పండును చింపాంజీ ఒకసారి కొరికిన తర్వాత.. తినమని తాబేలుకు ఇస్తుంది. తర్వాత మరో చింపాంజీ కూడా వీడియోలో కనిపిస్తుంది. దీన్ని ట్విట్టర్‌లో ఒకరు ” షేరింగ్ ఈస్ కేరింగ్ ” క్యాప్షన్ తో షేర్ చేశారు. వీరి మధ్య స్నేహంపై నెటిజన్లు జోరుగా కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోకు ఇప్పటికే 8.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 3.4 లక్షల లైకులు వచ్చాయి. వీడియోకు ఇప్పటికే 49 వేల మంది రీ ట్వీట్ కూడా చేశారు. “వావ్ ఆ చింపాంజీ చూడు.. ఎంత మంచిగా తన ఫ్రెండ్‌కు ఇస్తోంది” అని ఒకరు రాసుకొచ్చారు. కాగా, అత్యాశ తో చేతిలో.. కాళ్లతో.. నోట్లో కూడా ఆరెంజ్ ఫ్రూట్స్ ను పట్టుకొని చింపాంజీ పరుగులు తీసే వీడియో ఇటీవల వైరల్ అయింది. దానికి కూడా 2.3 మిలియన్ల వ్యూస్.. వేలాది లైకులు వచ్చాయి.

 

https://twitter.com/buitengebieden/status/1548674662275637251

  Last Updated: 20 Jul 2022, 02:26 PM IST