Site icon HashtagU Telugu

Overnight Millionaire : రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు.. చెత్తలో దొరికిన “బుక్” లైఫ్ మార్చింది

Overnight Millionaire

Overnight Millionaire

Overnight Millionaire :  రాత్రికి రాత్రి  కోటీశ్వరుడు కావడం అంటే ఇదే !!

రాత్రికి రాత్రి దశ తిరగడం అంటే ఇదే !!

చిలీకి చెందిన ఎక్సెక్వియెల్ హినోజోసా విషయంలో సరిగ్గా అదే జరిగింది..  

అతడు తన  ఇంటిని శుభ్రపరుస్తుండగా చెత్తకుప్పలో పాత పుస్తకం ఒకటి దొరికింది.

Also read : AP Political Zeros : ఇద్ద‌రూ ఇద్ద‌రే.! ఏపీ గోవిందాలు.!!

దాన్ని సింపుల్ గా తీసి.. తర్వాత చూద్దాం లే అని పక్కన పెట్టాడు..   ఆ తర్వాత ఇంట్లో వాళ్లు చూసి అది బ్యాంక్ పాస్ బుక్ అని ఎక్సెక్వియెల్ హినోజోసాకు చెప్పారు.. ఆ  పాస్ బుక్ ను బ్యాంకుకు తీసుకెళ్లిన హినోజోసా.. బ్యాంకు ఆఫీసర్ చెప్పిన మాట విని షాక్ అయ్యాడు.. 1970 నాటికి ఆ అకౌంట్లో హినోజోసా తండ్రి  రూ.14000 పొదుపు చేశారని.. వడ్డీతో సహా కలిపి ఇప్పుడవి  రూ.10 కోట్లకు పెరిగాయని బ్యాంకు అధికారి వివరించారు. దీంతో  హినోజోసా ఆనందానికి అవధులు లేకుండాపోయింది.    అయితే ఆ  పాస్‌బుక్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు చాలాకాలం కిందటే మూతపడిందనే చేదు నిజాన్ని కూడా  హినోజోసాకు బ్యాంకు ఆఫీసర్ చెప్తాడు..ఫలితంగా హినోజోసా ఆనందం ఆవిరి అవుతుంది.

Also read : Quit India Movement : క్విట్ ఇండియా ఉద్యమం ఎలా మొదలైందంటే…

అయితే ఆ పాస్‌బుక్‌పై  “స్టేట్ గ్యారెంటీడ్” అని రాసి ఉన్న పదం అతడికి ఒక ఆశాజ్యోతిలా కనిపించింది.  “స్టేట్ గ్యారెంటీడ్” అంటే.. ఒకవేళ డబ్బును చెల్లించడంలో బ్యాంక్‌ విఫలమైతే ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తానని ఇచ్చే హామీ అని  హినోజోసా తెలుసుకుంటాడు. “స్టేట్ గ్యారెంటీడ్” హామీని  ప్రస్తుత ప్రభుత్వం గౌరవించటానికి నిరాకరించినందుకు అతడు కోర్టు మెట్లు ఎక్కుతాడు. తన తండ్రి కష్టపడి సంపాదించి బ్యాంకులో పొదుపు చేసిన డబ్బులను  తనకు ఇప్పించాలని న్యాయ పోరాటం కొనసాగిస్తాడు. చివరకు  న్యాయస్థానం హినోజోసా కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అతడి తండ్రి అకౌంట్లో ఉన్న 10 కోట్ల రూపాయలు (Overnight Millionaire)  తీసుకునేందుకు మార్గం సుగమం అయింది. ఫలితంగా నిన్నమొన్నటి వరకు పేదరికంలో మగ్గిన అతడు..  ఇప్పుడు లక్షాధికారి అయ్యాడు.