Site icon HashtagU Telugu

Salary: శాలరీ రూ.43వేలు.. అకౌంట్లో పడిన కోటిన్నరతో జంప్!

Pesos

Pesos

ప్రతినెలా శాలరీ కోసం ఎదురు చూడటం ఎంప్లాయీస్ కు అలవాటే!! అతడు కూడా అందరిలాగే తనకు పడాల్సిన 43000 రూపాయల శాలరీ కోసం ఎదురుచూశాడు. 43వేలు అకౌంట్లో పడ్డట్టు ఎప్పుడు మెసేజ్ వస్తుందా అని ఎదురుచూస్తుంటే.. ఫోన్ మోగింది. మెసేజ్ ను తెరిచి చూసిన అతగాడు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు.

శాలరీ అకౌంట్లో కోటిన్నర రూపాయలు పడటంతో ఆనందాన్ని ఆపుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వచ్చింది.. ఫేక్ మెసేజా? రియల్ మెసేజా ? అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాడు. అందింది నిజమైన మెసేజే.. అకౌంట్లో పడింది కోటిన్నర రూపాయలే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ అరుదైన అనుభవం చిలీకి చెందిన కన్సార్షియో ఇండస్ట్రియల్ డీ అలిమెంటోస్ ( Consorcio Industrial de Alimentos) కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగికి ఎదురైంది. కంపెనీ అకౌంట్స్ విభాగం వాళ్ళు పొరపాటున అతడి అకౌంట్లో ఈ అమౌంట్ వేశారు.

దీని గురించి అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతడికి కాల్ చేసి మాట్లాడారు. శాలరీ డబ్బులు మినహా మిగిలినవన్నీ రీఫండ్ చేయాలని నిర్దేశించారు. దానికి అతడు ఓకే చెప్పినప్పటికీ.. డబ్బులు ఇంకా కంపెనీ బ్యాంక్ అకౌంట్లో వేయలదట. వెంటనే డబ్బులు (కోటిన్నర) రీఫండ్ చేయాలంటూ కంపెనీ అకౌంట్స్ విభాగం వరుస మెసేజ్ లు పంపినా అతడు స్పందించలేదని తెలుస్తోంది. ఎట్టకేలకు ఒకసారి కంపెనీ ఫోన్ కాల్ కు ఆన్సర్ ఇచ్చిన అతడు.. తాను బాగా నిద్రమత్తులో ఉన్నందున మెసేజ్ లకు రిప్లై ఇవ్వలేకపోయానని చెప్పాడు.ఆ తర్వాత కంపెనీ కి రిజైన్ లెటర్ పంపించేసి.. అతడు కోటిన్నర తో ఉడాయించినట్లు గుర్తించారు.