Robbery Case: నయా దోపిడీ.. చికెన్ వడ్డించారు, కోట్లు దొంగిలించారు!

నమ్మించి మోసం (Cheat) చేయడం ఈ రోజుల్లో ట్రెండ్ గా మారింది.

Published By: HashtagU Telugu Desk
Chiken

Chiken

నమ్మించి మోసం (Cheat) చేయడం ఈ రోజుల్లో ట్రెండ్ గా మారింది. చాలామంది డబ్బు పేరుతో, బంగారం పేరుతో, రియల్ ఏస్టేట్ అంటూ పరిచయాలు పెంచుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో చికెన్ (Chiken) పెట్టి కోట్ల రూపాయలను దోచుకెళ్లిన సంఘటన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన తమిళ్ నాడులోని కోయంబత్తూర్ లో జరిగింది. వర్షిణి అనే యువతి, స్థానికంగా ఉంటున్న రాజేశ్వరి అనే మహిళతో (Women) పరిచయం పెంచుకుంది.

రాజేశ్వరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వర్షిణి, తన వద్ద చాలామంది కస్టమర్లు ఉన్నారని, వేల ఎకరాల్ని నెల రోజుల్లోనే అమ్మించేస్తానని నమ్మబలికింది. దీంతో రాజేశ్వరికి (Rajeshwari) ఆశపుట్టింది. తనతో పాటు ముగ్గురు కస్టమర్లను తీసుకొస్తున్నానని, వాళ్లు అడ్వాన్స్ ఇస్తారని నమ్మబలికింది. ఓ ముగ్గురు వ్యక్తుల్ని తీసుకొని రాజేశ్వరి ఇంటికెళ్లింది వర్షిణి.

భోజనాల టైమ్ కావడంతో అంతా భోజనానికి (Lunch) కూర్చున్నారు. ఇంటికి వస్తూనే కోడికూర తీసుకొచ్చింది వర్షిణి. ఆ కూరలో మత్తు మందు కలిపి, భోజనంలో రాజేశ్వరికి వడ్డించింది. వీళ్లు మాత్రం దాన్ని తినకుండా జాగ్రత్త పడ్డారు. అలా ఇల్లు మొత్తం దోచేశారు. భోజనం మధ్యలోనే రాజేశ్వరి కుప్పకూలింది. వెంటనే వర్షిణి రంగంలోకి దిగింది. ఇంట్లో ఉన్న రెండున్నర కోట్ల రూపాయల డబ్బు (Two Crores), వంద తులాల బంగారంతో ఉడాయించింది. రాజేశ్వరికి మెళకువ వచ్చి చూస్తే ఇల్లు గుల్లయింది. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Bhatti Vikramarka: బంగారు తెలంగాణే భట్టి లక్ష్యం.. పాదయాత్రకు బ్రహ్మరథం!

  Last Updated: 06 May 2023, 02:22 PM IST