Chicken Curry: కోడి లేకుండా కోడి కూర.. ఎలా అంటే?

మాంస ప్రియులు ఒక్కొక్కరు ఒక మాంసాన్ని ఇష్టపడుతూ ఉంటారు.

  • Written By:
  • Updated On - June 14, 2022 / 08:38 PM IST

మాంస ప్రియులు ఒక్కొక్కరు ఒక మాంసాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కొంతమందికీ చికెన్, మరికొంతమందికి మటన్, ఇంకొంతమందికి చేపలు ఇలా ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు మాంసాన్ని తింటూ ఉంటారు. అయితే చాలా మంది ఎక్కువగా చికెన్ ను ఇష్టపడుతూ ఉంటారు. మరి చికెన్ తెనాలి అన్నం వండుకోవాలి అన్న తప్పకుండా కోడి ఉండాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం కోడి లేకపోయినా కూడా కోడి కూర వండు కోవచ్చు అని అంటున్నారు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఈ వీడియోలో చూస్తున్నది చికెన్ అయినప్పటికీ అది సహజంగా పెరిగిన కోడిమాంసం కాదు. దానిని కోడి మూలకణాల నుంచి చికెన్ ను తయారు చేశారు.

ఇలా ల్యాబ్ లో తయారు చేసిన ఈ చికెన్ ను విక్రయించడం కోసం ప్రపంచంలోనే మొదటిసారిగా కాలిఫోర్నియాలోని స్టార్టప్ ఈ ఫుడ్ కోసం అనుమతినిచ్చింది. అయితే దీనిని జంతువులను చంపకుండా, అడవులను నాశనం చేయకుండా, నేల లేకుండా కార్బన్ ఆహార భద్రత సమస్యలు లేకుండా మాంసం విక్రయించడానికి కోసం ఒక మంచి మార్గం అని అంటున్నారు జోస్ తెట్రిక్.

అయితే ఈ కోడి కణాలకు పోషకాలను అందించి వెచ్చగా ఉన్న ఒక ప్రత్యేక రసాయనాల్లో ఉంచుతారు. నాలుగు నుంచి 6 వారాల తరువాత ఈ కణాలు మాంసంగా మారతాయి. చిన్న దేశమైన సింగపూర్ ప్రతి ఆహారానికి దిగుమతుల పైనే ఆధారపడుతోంది. ఇక ఆహార భద్రతపై ఆందోళన చెందడంతో సింగపూర్ మాంసానికి బదులుగా ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నట్లు విలియం చెన్ తెలిపారు.