Site icon HashtagU Telugu

Swallows Jewels: పార్టీకి పిలిచి బిర్యానీ పెడితే…నగలు మింగేశాడు..!!

Food

Food

ఈద్ పార్టీకి పిలిచి ఆతిథ్యమిస్తే…బిర్యానీతోపాటు ఆభరణాలనూ మింగేశాడు ఓ వ్యక్తి. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన వెలుగు చూసింది. మంగళవారం రంజాన్ సందర్భంగా చెన్నెైలోని ఓ కుటుంబం ఈద్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి తన స్నేహితులతోపాటు ఆమె స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ ను కూడా విందుకు ఆహ్వానించింది. పార్టీకి వచ్చిన స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ మద్యం మత్తులో బిర్యానీతోపాటు నగలను మింగేశాడు.

వజ్రాల నెక్టెస్, బంగారు గొలుసు, డైమండ్ లాకెట్ మింగేశాడు. పార్టీ ముగించుకుని అతిథులు వెళ్లిన తర్వాత తన ఇంట్లో అల్మారాలో నగలు కనిపించకుండా పోయాని గమనించింది.
పార్టీకి వచ్చిన అతిథులను చెక్ చేయగా…తన స్నేహితురాలి ప్రియుడే నగలు మాయం చేసినట్లు అనుమానం వచ్చి…ఆమె విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతన్ని విచారించిన పోలీసులు…తానే బిర్యానీతోపాటు నగలను మింగేశానని అంగీకరించాడు. దీంతో పోలీసులు వైద్యుడితో నిందితుడి పొట్టను స్కానింగ్ చేసి చూశారు. కడుపులో ఆభరణాలు ఉన్నాయని తేలింది. దీంతో నిందితుడికి ఎనెమా చేసి 1.45వేల విలువైన నగలను వెలికితీసి పోలీసులకు అప్పగించారు.

Exit mobile version